Innidaa neesalamulu yeederene

ఇన్నిటా నీచలములు యీడేరెనే
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా నీచలములు యీడేరెనే
పన్ని నీనేరుపు లిట్టె పచరించవలెనా

(॥॥)
పెనగిఁ యాతఁడు నీకుఁ బ్రియములెల్లాఁ జెప్పె
తనిసి ఇంతటా నీచిత్తము వచ్చెనా
యెనసి వలచేనంటా ఇందరిలోనా నీవు
ననిచినమగవాని నగుఁబాటు సేతురా

(॥॥)
చెలరేఁగి సేయరానిచేఁతలెల్లా నీకుఁ జేసే
తలచిననీదుపంతము చెల్లెనా
మెలఁగి నీమాటలు మీరెనంటా నీవు
కిలకిలనగి యింత కిందుపరపింతురా

(॥॥)
కూరిమి నీకాఁగిటను కూడినట్టెల్లాఁ గూడె
కోరిన నీకోరికలు కొనసాగెనా
యీరీతి శ్రీ వేంకటేశుఁ డిచ్చకుఁడంటా నీవు
రారావు లిటుసేసి రతి నలయింతురా

(||pallavi||)
inniḍā nīsalamulu yīḍerĕne
panni nīnerubu liṭṭĕ pasariṁchavalĕnā

(||||)
pĕnagim̐ yādam̐ḍu nīgum̐ briyamulĕllām̐ jĕppĕ
tanisi iṁtaḍā nīsittamu vachchĕnā
yĕnasi valasenaṁṭā iṁdarilonā nīvu
nanisinamagavāni nagum̐bāḍu sedurā

(||||)
sĕlarem̐gi seyarānisem̐talĕllā nīgum̐ jese
talasinanīdubaṁtamu sĕllĕnā
mĕlam̐gi nīmāḍalu mīrĕnaṁṭā nīvu
kilagilanagi yiṁta kiṁdubarabiṁturā

(||||)
kūrimi nīgām̐giḍanu kūḍinaṭṭĕllām̐ gūḍĕ
korina nīgorigalu kŏnasāgĕnā
yīrīdi śhrī veṁkaḍeśhum̐ ḍichchagum̐ḍaṁṭā nīvu
rārāvu liḍusesi radi nalayiṁturā