Innidaa needani sitta meṟimgi segonavamma

ఇన్నిటా నీతని చిత్త మెఱిఁగి చేకొనవమ్మ
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా నీతని చిత్త మెఱిఁగి చేకొనవమ్మ
యెన్నటికి నలుగకు ఇచ్చకాలే వలెను

(॥ఇన్ని॥)
సిగ్గులేలే యితనితో చెలియ
సిగ్గుల గొల్లెతలను చేతులెత్తించె
వెగ్గళించకువే వీని వేమారు తొల్లి
వెగ్గళించిన సతిని వెసఁబిన్నఁజేసేను

(॥ఇన్ని॥)
యింటిలో దాఁగకువే యీత నెదుట
యింటిలోని గొల్లెతల నెంగిలి సే సె
దంట తనమేఁటికే తగ వీనితో
దంటల సురసతులఁ దానె లోఁగొనఁడా

(॥ఇన్ని॥)
ఆఱఁడిఁ బెట్టకువే యాతనిని
ఆఱఁడి గొల్లెతలను ఆండ్లఁజేసె
మీఱి శ్రీ వేంకటేశుఁడు మెచ్చి నిన్నేలె
మీఱినవారే కారా మెలుఁత లీతనికి

(||pallavi||)
inniḍā nīdani sitta mĕṟim̐gi segŏnavamma
yĕnnaḍigi nalugagu ichchagāle valĕnu

(||inni||)
siggulele yidanido sĕliya
siggula gŏllĕdalanu sedulĕttiṁchĕ
vĕggaḽiṁchaguve vīni vemāru tŏlli
vĕggaḽiṁchina sadini vĕsam̐binnam̐jesenu

(||inni||)
yiṁṭilo dām̐gaguve yīda nĕduḍa
yiṁṭiloni gŏllĕdala nĕṁgili se sĕ
daṁṭa tanamem̐ṭige taga vīnido
daṁṭala surasadulam̐ dānĕ lom̐gŏnam̐ḍā

(||inni||)
āṟam̐ḍim̐ bĕṭṭaguve yādanini
āṟam̐ḍi gŏllĕdalanu āṁḍlam̐jesĕ
mīṟi śhrī veṁkaḍeśhum̐ḍu mĕchchi ninnelĕ
mīṟinavāre kārā mĕlum̐ta līdanigi