Innidaa nee seye meemdu yimka nelaa nee

ఇన్నిటా నీ చెయే మీఁదు యిఁక నేలా నీ
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా నీ చెయే మీఁదు యిఁక నేలా నీ-
మన్నన నాకుఁ గద్దు నెమ్మది నుండవయ్యా

(॥ఇన్ని॥)
అండకు వచ్చితిని ఆకు మడి చిచ్చితిని
నిండిననా బాగ్యము నీ చిత్తము
పండెను నావలపు పంతము నీ కెక్కెను
కొండవంటిసంతసాన కొల్లున నవ్వవయ్యా

(॥ఇన్ని॥)
బడిఁ దగిలితిని బత్తులుఁ జేసితిని
యెడయనియాస నాది యెట్టైనాఁ జేయి
పెడరేఁచె నావేడుక పేరుఁ బెంపు నీకుఁ జెల్లె
అడియాలముగా నీవు అట్టె మెరయవయ్యా

(॥ఇన్ని॥)
కాఁగిటఁ గూడితిని కందువ లంటితిని
మాఁగెను నామోవి నీవు మరిగితివి
దాఁగక శ్రీవేంకటేశ తనిపితి విట్టె నన్ను
పాఁగిననాతోడుతను బతుకవయ్యా

(||pallavi||)
inniḍā nī sĕye mīm̐du yim̐ka nelā nī-
mannana nāgum̐ gaddu nĕmmadi nuṁḍavayyā

(||inni||)
aṁḍagu vachchidini āgu maḍi sichchidini
niṁḍinanā bāgyamu nī sittamu
paṁḍĕnu nāvalabu paṁtamu nī kĕkkĕnu
kŏṁḍavaṁṭisaṁtasāna kŏlluna navvavayyā

(||inni||)
baḍim̐ dagilidini battulum̐ jesidini
yĕḍayaniyāsa nādi yĕṭṭainām̐ jeyi
pĕḍarem̐sĕ nāveḍuga perum̐ bĕṁpu nīgum̐ jĕllĕ
aḍiyālamugā nīvu aṭṭĕ mĕrayavayyā

(||inni||)
kām̐giḍam̐ gūḍidini kaṁduva laṁṭidini
mām̐gĕnu nāmovi nīvu marigidivi
dām̐gaga śhrīveṁkaḍeśha tanibidi viṭṭĕ nannu
pām̐ginanādoḍudanu badugavayyā