ఇన్నిటా నాకుఁ జుట్టా లింక నెవ్వరు
(॥పల్లవి॥)
ఇన్నిటా నాకుఁ జుట్టా లింక నెవ్వరు
మన్నించితివి వేళ మరి చెప్ప నున్నదా
(॥ఇన్నిటా॥)
వెక్కసపుఁ గోరికల విరహమే నాది గాక
నెక్కొన్న తనువు కాఁక నీది గాదా
చెక్కునఁ బెట్టిన యట్టి చేయి నా డింతె కాక
చిక్కి దయదల చేటి చింత నీది గాదా
(॥ఇన్నిటా॥)
చిమ్మిరేఁగేయట్టి చిఱుఁ జెమటలే నాది గాక
నెమ్మది నింతా మోఁత నీది గాదా
కమ్మి కాటుక కన్నుల కాలువలు నావి గాక
తమ్మిచేతఁ దుడిచేటి తడి నీది గాదా
(॥ఇన్నిటా॥)
దగ్గరి నిన్నుఁ గూడేటి తమకమే నాది గాక
నిగ్గులరతియలపు నీది గాదా
మోగ్గళపు నిట్టూర్పు శ్రీవేంకటేశ నాది గాక
బగ్గన నవ్విన నవ్వు పైపై నీది గాదా
(||pallavi||)
inniḍā nāgum̐ juṭṭā liṁka nĕvvaru
manniṁchidivi veḽa mari sĕppa nunnadā
(||inniḍā||)
vĕkkasabum̐ gorigala virahame nādi gāga
nĕkkŏnna tanuvu kām̐ka nīdi gādā
sĕkkunam̐ bĕṭṭina yaṭṭi seyi nā ḍiṁtĕ kāga
sikki dayadala seḍi siṁta nīdi gādā
(||inniḍā||)
simmirem̐geyaṭṭi siṟum̐ jĕmaḍale nādi gāga
nĕmmadi niṁtā mom̐ta nīdi gādā
kammi kāḍuga kannula kāluvalu nāvi gāga
tammisedam̐ duḍiseḍi taḍi nīdi gādā
(||inniḍā||)
daggari ninnum̐ gūḍeḍi tamagame nādi gāga
niggularadiyalabu nīdi gādā
moggaḽabu niṭṭūrbu śhrīveṁkaḍeśha nādi gāga
baggana navvina navvu paibai nīdi gādā