Innidaa meludi neegu yeegenu mannimchavayyaa

ఇన్నిటా మేలుది నీకు యీకెను మన్నించవయ్యా
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా మేలుది నీకు యీకెను మన్నించవయ్యా
విన్నవించితిమి నేము వెలఁది చందములు

(॥ఇన్ని॥)
వినయములే కలితే వెంగెము లెన్ని యాడినా
పెనగొన్న తమకమే పెడరేఁచును
మనసే వొడఁబడితే మర్మ మెంత ముట్టించినా
గొనకొన్న వలపులు కొనసాగింపించును

(॥ఇన్ని॥)
సంగాతమే నిజమైతే జంకెన లెంతచూపినా
అంగవించి రతులకే యాసవుట్టును
కంగులేక మెలఁగితే గబ్బితనాన నుండివా
యెంగిలి మోవికినై యేకారింపించును

(॥ఇన్ని॥)
సరసమే నెరపితే సాదించి యెంత మీరినా
తరితీపు లుప్పతిల్లి తనివొందించు
యిరవై శ్రీవేంకటేశ యింతి విట్టె యేలితివి
నిరతపుఁగోరికలు నెరవేరింపించును

(||pallavi||)
inniḍā meludi nīgu yīgĕnu manniṁchavayyā
vinnaviṁchidimi nemu vĕlam̐di saṁdamulu

(||inni||)
vinayamule kalide vĕṁgĕmu lĕnni yāḍinā
pĕnagŏnna tamagame pĕḍarem̐sunu
manase vŏḍam̐baḍide marma mĕṁta muṭṭiṁchinā
gŏnagŏnna valabulu kŏnasāgiṁpiṁchunu

(||inni||)
saṁgādame nijamaide jaṁkĕna lĕṁtasūbinā
aṁgaviṁchi radulage yāsavuṭṭunu
kaṁgulega mĕlam̐gide gabbidanāna nuṁḍivā
yĕṁgili moviginai yegāriṁpiṁchunu

(||inni||)
sarasame nĕrabide sādiṁchi yĕṁta mīrinā
taridību luppadilli tanivŏṁdiṁchu
yiravai śhrīveṁkaḍeśha yiṁti viṭṭĕ yelidivi
niradabum̐gorigalu nĕraveriṁpiṁchunu