Innidaa mannimchidivi yippudu nem gaadamtinaa

ఇన్నిటా మన్నించితివి యిప్పుడు నేఁ గాదంటినా
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా మన్నించితివి యిప్పుడు నేఁ గాదంటినా
సన్నల జంకించ మచ్చరమా నాకు

(॥ఇన్ని॥)
కవగూడి నీకరుణ గలిగితే, జాలుగాక
సవతుల సాదించ చలమా నాకు
జవళి నీ విట్టె వుంటే సంతోసించుకొందుఁగాక
వివరించి నాదడువ వేడుకా నాకు

(॥ఇన్ని॥)
చింతదీర నాసేవ చేకొంటేఁ జాలుఁగాక
కాంతల నుంకించి తిట్ట గర్వమా నాకు
ఇంత నన్నెత్తుసేసితే ఇటు నిన్ను మెత్తుఁగాక
పంత మందరితో నాడ పగటా నాకు

(॥ఇన్ని॥)
కొద్దిమీరి నన్నీరీతిఁ గూడితేఁ జాలుఁగాక
వొద్దివారినెల్లా దూర నొరటా నాకు
గద్దరినా యలమేల్ మంగను శ్రీవేంకటేశ్వర
వొద్దిక నన్నుఁ గూడితి వొడఁబాటా నాకు

(||pallavi||)
inniḍā manniṁchidivi yippuḍu nem̐ gādaṁṭinā
sannala jaṁkiṁcha machcharamā nāgu

(||inni||)
kavagūḍi nīgaruṇa galigide, jālugāga
savadula sādiṁcha salamā nāgu
javaḽi nī viṭṭĕ vuṁṭe saṁtosiṁchugŏṁdum̐gāga
vivariṁchi nādaḍuva veḍugā nāgu

(||inni||)
siṁtadīra nāseva segŏṁṭem̐ jālum̐gāga
kāṁtala nuṁkiṁchi tiṭṭa garvamā nāgu
iṁta nannĕttuseside iḍu ninnu mĕttum̐gāga
paṁta maṁdarido nāḍa pagaḍā nāgu

(||inni||)
kŏddimīri nannīrīdim̐ gūḍidem̐ jālum̐gāga
vŏddivārinĕllā dūra nŏraḍā nāgu
gaddarinā yalamel maṁganu śhrīveṁkaḍeśhvara
vŏddiga nannum̐ gūḍidi vŏḍam̐bāḍā nāgu