Innidaa jaanavu neevu yemtani pogadavachchu

ఇన్నిటా జాణవు నీవు యెంతని పొగడవచ్చు
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా జాణవు నీవు యెంతని పొగడవచ్చు
నిన్నుఁ జూచి వేడుకకు నెట్టన నవ్వితిని

(॥ఇన్ని॥)
చెంతనుండి విన్నపాలు సేసితి నింతేకాని
యింతిపై బత్తి గలవు యెరుఁగుదుము
కొంత గొంత కూరిములు గొసిరితి మింతేకాని
వింతలైన మీ వలపు వింటిమి నాఁడే

(॥ఇన్ని॥)
యేమరక వొకమారు యెచ్చరించితిమిగాని
కామినిపె నీ తమి గంటిమి నేము -
చూ మరల రావని సొలసితి మింతేకాని
చేముంతు వనుచు సంతోసించితిమి నాడే

(॥ఇన్ని॥)
చొప్పుగాఁ జుట్టరియము చూపితి మింతేకాని
యిప్పడఁతి నేలేవని యెంచుకొంటిమి
ముప్పిరి మా చెలికిగా మొక్కితి మింతేకాని
తప్పక శ్రీవేంకటేశ తనిసితిమి నాఁడే

(||pallavi||)
inniḍā jāṇavu nīvu yĕṁtani pŏgaḍavachchu
ninnum̐ jūsi veḍugagu nĕṭṭana navvidini

(||inni||)
sĕṁtanuṁḍi vinnabālu sesidi niṁtegāni
yiṁtibai batti galavu yĕrum̐gudumu
kŏṁta gŏṁta kūrimulu gŏsiridi miṁtegāni
viṁtalaina mī valabu viṁṭimi nām̐ḍe

(||inni||)
yemaraga vŏgamāru yĕchchariṁchidimigāni
kāminibĕ nī tami gaṁṭimi nemu -
sū marala rāvani sŏlasidi miṁtegāni
semuṁtu vanusu saṁtosiṁchidimi nāḍe

(||inni||)
sŏppugām̐ juṭṭariyamu sūbidi miṁtegāni
yippaḍam̐ti nelevani yĕṁchugŏṁṭimi
muppiri mā sĕligigā mŏkkidi miṁtegāni
tappaga śhrīveṁkaḍeśha tanisidimi nām̐ḍe