Innidaa jaanave neegidi voja

ఇన్నిటా జాణవే నీకిది వోజ
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా జాణవే నీకిది వోజ
యెన్నేని సంతోసించేనీ కిదివో వోజా

(॥ఇన్ని॥)
వచ్చినప్పుడే పతికి వలపు పైఁబూసితివి
యెచ్చరికగలదాని కిదివో వోజా
లచ్చనలు నించితేను లలి నూరకె వుంటివి
యిచ్చకపుజవరాలి కిదివో వోజా

(॥ఇన్ని॥)
సరసములాడితేనే చనవెల్లా నిచ్చితివి
యెరవులేని దానికి నిదివో వోజ
తెరవేసినంతలోనే తెలిసి పాదాలొత్తితి-
విరవైన పెండ్లికూఁతు కిదివో వోజా

(॥ఇన్ని॥)
చెంగటికి వచ్చితేనే శ్రీవేంకటేశుఁ గూడితి-
వింగితజ్ఞురాలికి నిదివో వోజ
వుంగిటితమ్ముల మాతఁ డుమియఁబోతే నీవు
యెంగిలికిఁ జేయొగ్గితి విదివో వోజా

(||pallavi||)
inniḍā jāṇave nīgidi voja
yĕnneni saṁtosiṁchenī kidivo vojā

(||inni||)
vachchinappuḍe padigi valabu paim̐būsidivi
yĕchcharigagaladāni kidivo vojā
lachchanalu niṁchidenu lali nūragĕ vuṁṭivi
yichchagabujavarāli kidivo vojā

(||inni||)
sarasamulāḍidene sanavĕllā nichchidivi
yĕravuleni dānigi nidivo voja
tĕravesinaṁtalone tĕlisi pādālŏttidi-
viravaina pĕṁḍligūm̐tu kidivo vojā

(||inni||)
sĕṁgaḍigi vachchidene śhrīveṁkaḍeśhum̐ gūḍidi-
viṁgidajñurāligi nidivo voja
vuṁgiḍidammula mādam̐ ḍumiyam̐bode nīvu
yĕṁgiligim̐ jeyŏggidi vidivo vojā