ఇన్నిటా జాణఁడవైతే నేమాయను
(॥పల్లవి॥)
ఇన్నిటా జాణఁడవైతే నేమాయను
పన్ని చెఱకునఁ బండు వండినట్టె ఆయను
(॥ఇన్ని॥)
అందరును మనవారె అంగనలు నీకు నేఁడు
యెందరు చుట్టాలఇన నేమాయను
అందుకుఁగా నిజాలేల అమరఁజెప్పఁగనేల
ఇందులోనే వుప్పొలికి ఇనుమడి ఆయను
(॥ఇన్ని॥)
పనికివచ్చినవారె పాయపువారెల్ల నీకు
యెనతురు గాక అందుకేమాయను
వెనకముందెంచనేల వెఱపులు మరియేల
ఘనముగఁ బాలు నీరు గలసినట్టాయను
(॥ఇన్ని॥)
తగినట్టిమేనవారే దండనున్న వారెల్ల
యెగసక్కే లిందుకేల యేమాయను
నగుతా శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితి విప్పుడు
చిగురుతంగేటిజున్ను చేరినట్టె ఆయను
(||pallavi||)
inniḍā jāṇam̐ḍavaide nemāyanu
panni sĕṟagunam̐ baṁḍu vaṁḍinaṭṭĕ āyanu
(||inni||)
aṁdarunu manavārĕ aṁganalu nīgu nem̐ḍu
yĕṁdaru suṭṭāla̮ina nemāyanu
aṁdugum̐gā nijālela amaram̐jĕppam̐ganela
iṁdulone vuppŏligi inumaḍi āyanu
(||inni||)
panigivachchinavārĕ pāyabuvārĕlla nīgu
yĕnaduru gāga aṁdugemāyanu
vĕnagamuṁdĕṁchanela vĕṟabulu mariyela
ghanamugam̐ bālu nīru galasinaṭṭāyanu
(||inni||)
taginaṭṭimenavāre daṁḍanunna vārĕlla
yĕgasakke liṁdugela yemāyanu
nagudā śhrī veṁkaḍeśha nannum̐ gūḍidi vippuḍu
sigurudaṁgeḍijunnu serinaṭṭĕ āyanu