Innidaa jaanalainavaa rerumgudu reeyimpu

ఇన్నిటా జాణలైనవా రెరుఁగుదు రీయింపు
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా జాణలైనవా రెరుఁగుదు రీయింపు
చెన్నుగా దైవము తొల్లె సేసిన దీయింపు

(॥ఇన్ని॥)
వేసగికాలమునాఁటివెన్నెల లింపు
సేసలు వెట్టేయప్పటి సిగ్గు లింపు
వేసరక అత్తవారివిందులు యింపు
మోసపోనియట్టిరతి మోవితేనే లింపు

(॥ఇన్ని॥)
అట్టే వసంతపు చల్లులాట లింపు
జట్టిగొన్నప్పటి సరసము లింపు
వెట్టదీర దప్పికి వీడెము లింపు
గుట్టుతో నుండేయప్పటి కొసరులే ఇంపు

(॥ఇన్ని॥)
కడుఁజెమటకు చల్లగాలి యింపు
గుడిగొన్న కాఁగిటికి కూటము లింపు
అడరి శ్రీవేంకటేశ అలమేల్మంగకు నీకు
నొడఁబాటుమాటల వుచితము లింపు

(||pallavi||)
inniḍā jāṇalainavā rĕrum̐gudu rīyiṁpu
sĕnnugā daivamu tŏllĕ sesina dīyiṁpu

(||inni||)
vesagigālamunām̐ṭivĕnnĕla liṁpu
sesalu vĕṭṭeyappaḍi siggu liṁpu
vesaraga attavāriviṁdulu yiṁpu
mosaboniyaṭṭiradi movidene liṁpu

(||inni||)
aṭṭe vasaṁtabu sallulāḍa liṁpu
jaṭṭigŏnnappaḍi sarasamu liṁpu
vĕṭṭadīra dappigi vīḍĕmu liṁpu
guṭṭudo nuṁḍeyappaḍi kŏsarule iṁpu

(||inni||)
kaḍum̐jĕmaḍagu sallagāli yiṁpu
guḍigŏnna kām̐giḍigi kūḍamu liṁpu
aḍari śhrīveṁkaḍeśha alamelmaṁgagu nīgu
nŏḍam̐bāḍumāḍala vusidamu liṁpu