ఇన్నిటా ఘనుఁడు తాను యెంచితే నే నెంతదాన
(॥పల్లవి॥)
ఇన్నిటా ఘనుఁడు తాను యెంచితే నే నెంతదాన
సన్నిధినుండి నాకు చనవిచ్చీ నితఁడు
(॥ఇన్ని॥)
చక్కనిదాననంటాను సారెసారెఁ బొగడీని
చెక్కునొక్కి వలపురేఁచీ నితఁడు
యెక్కడ నేరిచినాఁడో వేడలేని మాటలాడి
గక్కన నా మనసెల్లాఁ గరఁగించీ నితఁడు
(॥ఇన్ని॥)
నా మొగము చూచి చూచి నవ్వులెల్లా నవ్వీని
ఆముకొని చనుగుబ్బలంటీ నితఁడు
యేమి దలఁచుకున్నాఁడో ఇచ్చకములెల్లాఁ జేసి
కామించి మెచ్చులు మెచ్చి కాఁగిలించీ నితఁడు
(॥ఇన్ని॥)
కప్పరపువిడె మిచ్చి కడు నన్ను మన్నించీని
చెప్పరాని చేఁతలెల్లాఁ జేసీ నితఁడు
ముప్పిరి నెంతజాణఁడో మోహములెల్లాఁ జల్లి
ఇప్పుడే శ్రీవేంకటేశుఁ డింతసే సె నితఁడు
(||pallavi||)
inniḍā ghanum̐ḍu tānu yĕṁchide ne nĕṁtadāna
sannidhinuṁḍi nāgu sanavichchī nidam̐ḍu
(||inni||)
sakkanidānanaṁṭānu sārĕsārĕm̐ bŏgaḍīni
sĕkkunŏkki valaburem̐sī nidam̐ḍu
yĕkkaḍa nerisinām̐ḍo veḍaleni māḍalāḍi
gakkana nā manasĕllām̐ garam̐giṁchī nidam̐ḍu
(||inni||)
nā mŏgamu sūsi sūsi navvulĕllā navvīni
āmugŏni sanugubbalaṁṭī nidam̐ḍu
yemi dalam̐sugunnām̐ḍo ichchagamulĕllām̐ jesi
kāmiṁchi mĕchchulu mĕchchi kām̐giliṁchī nidam̐ḍu
(||inni||)
kapparabuviḍĕ michchi kaḍu nannu manniṁchīni
sĕpparāni sem̐talĕllām̐ jesī nidam̐ḍu
muppiri nĕṁtajāṇam̐ḍo mohamulĕllām̐ jalli
ippuḍe śhrīveṁkaḍeśhum̐ ḍiṁtase sĕ nidam̐ḍu