Innidaa ghanumdu daanu yemiseppere

ఇన్నిటా ఘనుఁడు దాను యేమిచెప్పేరే
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా ఘనుఁడు దాను యేమిచెప్పేరే
యెన్నుకొనీ నా గుణము లేమిచెప్పేరే

(॥ఇన్ని॥)
చెంతఁ దనచెప్పినట్టు సేసితినంటా నిదె
యెంత నన్ను బుజ్జగించీ నేమిచెప్పేరే
అంతటాఁ దన కిచ్చకమాడితినంటా నిదె
ఇంతలో నన్నుఁ బొగడీ నేమిచెప్పేరే

(॥ఇన్ని॥)
వొట్టి తనపై పాటలు వొనరఁ బాడితినంటా
యిట్టె విడెమిచ్చీని యేమిచెప్పేరే
జట్టిగాఁజన్నులతోడ సాము సేయించితినంటా
యెట్టనెదుటనే మెచ్చీ నేమిచెప్పేరే

(॥ఇన్ని॥)
మనసుమర్మములంటా మంతనమాడితినంటా
యెనసి కాఁగిలించీ యేమిచెప్పేరే
చెనకి మొక్కితినంటా శ్రీవేంకటేశ్వరుఁడు
యినుమడిగా మన్నించె నేమిచెప్పేరే

(||pallavi||)
inniḍā ghanum̐ḍu dānu yemisĕppere
yĕnnugŏnī nā guṇamu lemisĕppere

(||inni||)
sĕṁtam̐ danasĕppinaṭṭu sesidinaṁṭā nidĕ
yĕṁta nannu bujjagiṁchī nemisĕppere
aṁtaḍām̐ dana kichchagamāḍidinaṁṭā nidĕ
iṁtalo nannum̐ bŏgaḍī nemisĕppere

(||inni||)
vŏṭṭi tanabai pāḍalu vŏnaram̐ bāḍidinaṁṭā
yiṭṭĕ viḍĕmichchīni yemisĕppere
jaṭṭigām̐jannuladoḍa sāmu seyiṁchidinaṁṭā
yĕṭṭanĕduḍane mĕchchī nemisĕppere

(||inni||)
manasumarmamulaṁṭā maṁtanamāḍidinaṁṭā
yĕnasi kām̐giliṁchī yemisĕppere
sĕnagi mŏkkidinaṁṭā śhrīveṁkaḍeśhvarum̐ḍu
yinumaḍigā manniṁchĕ nemisĕppere