Innidaa doravu neevu yimta seduraa

ఇన్నిటా దొరవు నీవు యింత సేతురా
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా దొరవు నీవు యింత సేతురా
చన్ను లంటే విదె నీకు చల మాయఁగా

(॥ఇన్నిటా॥)
చెఱఁగు మాసినవేళ చేరి ముట్ట వచ్చేవు
కొఱ తంటా వద్దంటేఁ గోపగించేవు
మెఱసీ తొల్లిటి దోసమె నేఁ గురియఁగాను
నెఱి నిది యిప్పుడె నీకు బాఁ తాయఁగా

(॥ఇన్నిటా॥)
యింట నే భోఁసేనేవేళ యెంగిలి ముట్ట వచ్చేవు
అంటకు మన్నంతలోనె అలిగేవు
వెంటనె నా నోటనుండి వేమారు జిందఁగాను
జంటల నీ కదియున సర కాయఁగా

(॥ఇన్నాటా॥)
జలక మాడెటివేళ సంగడికి వచ్చేవు
తొల మంటే కాఁగిలించి దొమ్మి సేసేవు
మలసి శ్రీవెంకటేశ మలినముఁ బాయఁగాను
తిలకించే వది నీకు దిష్ట మాయఁగా

(||pallavi||)
inniḍā dŏravu nīvu yiṁta sedurā
sannu laṁṭe vidĕ nīgu sala māyam̐gā

(||inniḍā||)
sĕṟam̐gu māsinaveḽa seri muṭṭa vachchevu
kŏṟa taṁṭā vaddaṁṭem̐ gobagiṁchevu
mĕṟasī tŏlliḍi dosamĕ nem̐ guriyam̐gānu
nĕṟi nidi yippuḍĕ nīgu bām̐ tāyam̐gā

(||inniḍā||)
yiṁṭa ne bhom̐seneveḽa yĕṁgili muṭṭa vachchevu
aṁṭagu mannaṁtalonĕ aligevu
vĕṁṭanĕ nā noḍanuṁḍi vemāru jiṁdam̐gānu
jaṁṭala nī kadiyuna sara kāyam̐gā

(||innāḍā||)
jalaga māḍĕḍiveḽa saṁgaḍigi vachchevu
tŏla maṁṭe kām̐giliṁchi dŏmmi sesevu
malasi śhrīvĕṁkaḍeśha malinamum̐ bāyam̐gānu
tilagiṁche vadi nīgu diṣhṭa māyam̐gā