ఇన్నిటా దొరవు నీవు యిందరు నున్నారీడ
(॥పల్లవి॥)
ఇన్నిటా దొరవు నీవు యిందరు నున్నారీడ
పన్ని నీ కతలు బట్ట బాయిట వేయింతునా
(॥ఇన్నిటా॥)
నీవేమి సేసినాను నిన్ను మెచ్చఁగలఁ గాక
కావి కన్నులను నిన్నుఁ గసరఁగఁ గలనా
యీవేళ నీవు బొంకితే యిది నిజమందుఁ గాక
భావించి నిన్నుఁ గల్ల పరచఁగఁ గలనా
(॥ఇన్నిటా॥)
వొద్ద నీవు గూచుండితే వోరుచుకోఁగల గాక
అద్దలించి నిన్ను వెంగెమాడఁ గలనా
పొద్దువోయి వచ్చినాను పొదిగి చేకొందుఁ గాక
వద్దువద్దనుచు నీతో వాదించఁ గలనా
(॥ఇన్నిటా॥)
కొంగువట్టి తీసినాను కూరిమిఁ జేకొందుఁ గాక
చెంగిచెంగి పానుపుపై సిగ్గువడఁ గలనా
రంగుగా శ్రీవేంకటేశ రతులఁ గడపలోన
అంగవించితివి ముద మణఁచుకోఁ గలనా
(||pallavi||)
inniḍā dŏravu nīvu yiṁdaru nunnārīḍa
panni nī kadalu baṭṭa bāyiḍa veyiṁtunā
(||inniḍā||)
nīvemi sesinānu ninnu mĕchcham̐galam̐ gāga
kāvi kannulanu ninnum̐ gasaram̐gam̐ galanā
yīveḽa nīvu bŏṁkide yidi nijamaṁdum̐ gāga
bhāviṁchi ninnum̐ galla parasam̐gam̐ galanā
(||inniḍā||)
vŏdda nīvu gūsuṁḍide vorusugom̐gala gāga
addaliṁchi ninnu vĕṁgĕmāḍam̐ galanā
pŏdduvoyi vachchinānu pŏdigi segŏṁdum̐ gāga
vadduvaddanusu nīdo vādiṁcham̐ galanā
(||inniḍā||)
kŏṁguvaṭṭi tīsinānu kūrimim̐ jegŏṁdum̐ gāga
sĕṁgisĕṁgi pānububai sigguvaḍam̐ galanā
raṁgugā śhrīveṁkaḍeśha radulam̐ gaḍabalona
aṁgaviṁchidivi muda maṇam̐sugom̐ galanā