ఇన్నిటా దేవరవు నిన్నేమీ ననఁజాలను
(॥పల్లవి॥)
ఇన్నిటా దేవరవు నిన్నేమీ ననఁజాలను
తన్నుఁదానే వచ్చీ మేలు దండము నీకు
(॥ఇన్ని॥)
యెక్కడో ఆపెను నన్నునిద్దరి మాట లాడించి
తక్కులఁబెట్టకు మిదె దండము నీకు
వొక్కరిచేతివిడె మొక్కరిచేతికిచ్చి
తక్కువ సేయకు మిఁక దండము నీకు
(॥ఇన్ని॥)
వొప్పి వొరట్లు వెట్టి వూడిగాలు సేయించుక
దప్పి దేరించకు మోవి దండము నీకు
కప్పి వొక్క రొక్కరినిఁ గాఁగిలించు కొమ్మని
తప్పించుకోకుమిఁక దండము నీకు
(॥ఇన్ని॥)
యెగసక్కేల కిద్దరి నిరుమేలాఁ బెట్టుకొని
తగవులఁ బెట్ట కంత దండము నీకు
నిగిడి శ్రీ వేంకటేశ నేఁడు మమ్ము నేలితివి
తగులు విడువకిఁక దండము నీకు
(||pallavi||)
inniḍā devaravu ninnemī nanam̐jālanu
tannum̐dāne vachchī melu daṁḍamu nīgu
(||inni||)
yĕkkaḍo ābĕnu nannuniddari māḍa lāḍiṁchi
takkulam̐bĕṭṭagu midĕ daṁḍamu nīgu
vŏkkarisediviḍĕ mŏkkarisedigichchi
takkuva seyagu mim̐ka daṁḍamu nīgu
(||inni||)
vŏppi vŏraṭlu vĕṭṭi vūḍigālu seyiṁchuga
dappi deriṁchagu movi daṁḍamu nīgu
kappi vŏkka rŏkkarinim̐ gām̐giliṁchu kŏmmani
tappiṁchugogumim̐ka daṁḍamu nīgu
(||inni||)
yĕgasakkela kiddari nirumelām̐ bĕṭṭugŏni
tagavulam̐ bĕṭṭa kaṁta daṁḍamu nīgu
nigiḍi śhrī veṁkaḍeśha nem̐ḍu mammu nelidivi
tagulu viḍuvagim̐ka daṁḍamu nīgu