ఇన్నిటా భోగింతుగాక ఇఁక నెన్నఁడు
(॥పల్లవి॥)
ఇన్నిటా భోగింతుగాక ఇఁక నెన్నఁడు
యెన్నికలు సమకూడె నియ్యకొనవయ్యా
(॥ఇన్ని॥)
చెలరేఁగి చెలరేఁగి చెప్పీ నాపె నీతోను
వెలఁది విన్నపములు వినవయ్యా
కులికి కులికి నిన్నుఁ కుచములఁ గుమ్మియెత్తీ
కలికి చేఁతలకుఁ గరఁగవయ్యా
(॥ఇన్ని॥)
సారె సారె నిన్నుఁ జూచి సన్నలెల్లాఁ జేసీ నాపె
తేరకొనఁ జూచి నీవు తెలియవయ్యా
కేరి కేరి నవ్వుతాను గీరీఁ జెక్కులు గోర
కూరిములన్నియునుఁ జేకొనవయ్యా
(॥ఇన్ని॥)
నిక్కి నిక్కి చూచి నిన్ను నెయ్యపుఁగాఁగిటఁ గూడె
యిక్కువ లంటుచుఁ జనవీయవయ్యా
అక్కరతో శ్రీ వేంకటాధిప నీరతి యింతి
దక్కగొనె నీమేలు చక్కఁగొనవయ్యా
(||pallavi||)
inniḍā bhogiṁtugāga im̐ka nĕnnam̐ḍu
yĕnnigalu samagūḍĕ niyyagŏnavayyā
(||inni||)
sĕlarem̐gi sĕlarem̐gi sĕppī nābĕ nīdonu
vĕlam̐di vinnabamulu vinavayyā
kuligi kuligi ninnum̐ kusamulam̐ gummiyĕttī
kaligi sem̐talagum̐ garam̐gavayyā
(||inni||)
sārĕ sārĕ ninnum̐ jūsi sannalĕllām̐ jesī nābĕ
teragŏnam̐ jūsi nīvu tĕliyavayyā
keri keri navvudānu gīrīm̐ jĕkkulu gora
kūrimulanniyunum̐ jegŏnavayyā
(||inni||)
nikki nikki sūsi ninnu nĕyyabum̐gām̐giḍam̐ gūḍĕ
yikkuva laṁṭusum̐ janavīyavayyā
akkarado śhrī veṁkaḍādhiba nīradi yiṁti
dakkagŏnĕ nīmelu sakkam̐gŏnavayyā