Inni yubaayamu limka neda kekku shreehari

ఇన్ని యుపాయము లింక నేడ కెక్కు శ్రీహరి
Language

(॥పల్లవి॥)
ఇన్ని యుపాయము లింక నేడ కెక్కు శ్రీహరి
పన్ని నీ మఱఁగు చొచ్చి పాయకుండీఁ గాక

(॥ఇన్ని॥)
అనంతకోటి జన్మములందుఁ జేసినపాపములు
మొనసి నేనొక జన్మమున నీఁగినా
ననిచి కర్మానుష్టానము నేఁడు సేయఁబోతే
పనివడి ముంతనీట బడబాగ్ని ఆరునా

(॥ఇన్ని॥)
పెక్కు కవిలెలవ్రాఁత కుంభీపాకరౌరవాలు
వొక్క దేహాననే పొంది వుత్తరించేనా
తక్కక నేఁడీ ఘోరతపములు సేయఁబోతే
గక్కన జలధి బుఱ్ఱకాయ నిండేనా

(॥ఇన్ని॥)
బలువై అనాది వేళ్లు వారిన సంసారము
తలమోచి నేఁ డింతలో తవ్వివేసేనా
నెలవై శ్రీ వేంకటేశ నే నేఁడు పుణ్య మంటితే
చెలఁగి పెను గాలికి చింపి చేఁటలడ్డమా

(||pallavi||)
inni yubāyamu liṁka neḍa kĕkku śhrīhari
panni nī maṟam̐gu sŏchchi pāyaguṁḍīm̐ gāga

(||inni||)
anaṁtagoḍi janmamulaṁdum̐ jesinabābamulu
mŏnasi nenŏga janmamuna nīm̐ginā
nanisi karmānuṣhṭānamu nem̐ḍu seyam̐bode
panivaḍi muṁtanīḍa baḍabāgni ārunā

(||inni||)
pĕkku kavilĕlavrām̐ta kuṁbhībāgarauravālu
vŏkka dehānane pŏṁdi vuttariṁchenā
takkaga nem̐ḍī ghoradabamulu seyam̐bode
gakkana jaladhi buṭragāya niṁḍenā

(||inni||)
baluvai anādi veḽlu vārina saṁsāramu
talamosi nem̐ ḍiṁtalo tavvivesenā
nĕlavai śhrī veṁkaḍeśha ne nem̐ḍu puṇya maṁṭide
sĕlam̐gi pĕnu gāligi siṁpi sem̐ṭalaḍḍamā