Inni vinnabamulunu imdulone vunnavi

ఇన్ని విన్నపములును ఇందులోనె వున్నవి
Language

(॥పల్లవి॥)
ఇన్ని విన్నపములును ఇందులోనె వున్నవి
అన్నిటాను చెలియ పుణ్యము నీచే నున్నది

(॥ఇన్ని॥)
వలవ నేర్చినవారు వాదులాడనేరరు
పలుక నేర్చినవారు పగ నేరరు
వలవేసి సతిమీఁద వట్టి దూరులు గట్టకు
నిలువుఁ బతిమవలె నీముందర నున్నది

(॥ఇన్ని॥)
తగవు గలుగువారు దంటమాట లాడరు
మొగమోట గలవారు మొరఁగలేరు
బిగిసి కామినిమీఁద పెనఁగఁగఁ బనిలేదు
నిగిడి చిలుకవలె నీచేతిలో నున్నది

(॥ఇన్ని॥)
కూటమిగలుగువారు కొరతలే యెంచరు
మాట పట్టు గలవారు మచ్చరించరు
యీటున శ్రీ వేంకటేశ యీపె నీవుఁ గూడఁగాను
గాఁటపుఁ బెన్నిధివలె కాఁగిటలో నున్నది

(||pallavi||)
inni vinnabamulunu iṁdulonĕ vunnavi
anniḍānu sĕliya puṇyamu nīse nunnadi

(||inni||)
valava nersinavāru vādulāḍaneraru
paluga nersinavāru paga neraru
valavesi sadimīm̐da vaṭṭi dūrulu gaṭṭagu
niluvum̐ badimavalĕ nīmuṁdara nunnadi

(||inni||)
tagavu galuguvāru daṁṭamāḍa lāḍaru
mŏgamoḍa galavāru mŏram̐galeru
bigisi kāminimīm̐da pĕnam̐gam̐gam̐ baniledu
nigiḍi silugavalĕ nīsedilo nunnadi

(||inni||)
kūḍamigaluguvāru kŏradale yĕṁcharu
māḍa paṭṭu galavāru machchariṁcharu
yīḍuna śhrī veṁkaḍeśha yībĕ nīvum̐ gūḍam̐gānu
gām̐ṭabum̐ bĕnnidhivalĕ kām̐giḍalo nunnadi