Inni suddulunu vimti mimkaa raamdaa

ఇన్ని సుద్దులును వింటి మింకా రాఁడా
Language

(॥పల్లవి॥)
ఇన్ని సుద్దులును వింటి మింకా రాఁడా
యెన్నిక కెక్కించేఁగాని యింకా రాఁడా

(॥ఇన్ని॥)
కాంతునిఁ బిలువ నంపి కడవాకిటనే వుండి
యింతి యెదురు చూచీని యింకా రాఁడా
చింతతో మెయి చెమరించె చెక్కులెల్లాఁ బులకించె
యెంతలేదు తనగర్వ మింకా రాఁడా

(॥ఇన్ని॥)
అప్పసము తనతో నేనమ్మ విడె మంపేనంటే
యిప్పుడే వచ్చేననె యింకా రాఁడా
ముప్పిరి నిట్టూర్పు మూఁగె ముదితమై కాఁకరేఁగె
ఇప్పటివలె నుండునా ఇంకా రాఁడా

(॥ఇన్ని॥)
కందువపానుపుమీఁద కాచుకున్నది లేమ
ఇందరుఁ బిలువఁబోరే ఇంకా రాఁడా
అందపు శ్రీవేంకటేశుఁ డంతలో విచ్చేసికూడె
ఇందుఁ గొలువుచావడి కింకా రాఁడా

(||pallavi||)
inni suddulunu viṁṭi miṁkā rām̐ḍā
yĕnniga kĕkkiṁchem̐gāni yiṁkā rām̐ḍā

(||inni||)
kāṁtunim̐ biluva naṁpi kaḍavāgiḍane vuṁḍi
yiṁti yĕduru sūsīni yiṁkā rām̐ḍā
siṁtado mĕyi sĕmariṁchĕ sĕkkulĕllām̐ bulagiṁchĕ
yĕṁtaledu tanagarva miṁkā rām̐ḍā

(||inni||)
appasamu tanado nenamma viḍĕ maṁpenaṁṭe
yippuḍe vachchenanĕ yiṁkā rām̐ḍā
muppiri niṭṭūrbu mūm̐gĕ mudidamai kām̐karem̐gĕ
ippaḍivalĕ nuṁḍunā iṁkā rām̐ḍā

(||inni||)
kaṁduvabānubumīm̐da kāsugunnadi lema
iṁdarum̐ biluvam̐bore iṁkā rām̐ḍā
aṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalo vichchesigūḍĕ
iṁdum̐ gŏluvusāvaḍi kiṁkā rām̐ḍā