Inni samdaalagu guri yee vanidayai vunnadi

ఇన్ని చందాలకు గురి యీ వనితయై వున్నది
Language

(॥పల్లవి॥)
ఇన్ని చందాలకు గురి యీ వనితయై వున్నది
యెన్నుకొని వేడుకతో నేలుదువుగాని

(॥ఇన్ని॥)
చేరి నీవు వెంచిన చిలుక గాదుసుమీ
పేరుకొని నీ దేవులు పిలిచీఁగాని
కూరిమి నీవనములో కోవిల గాదుసుమీ
సారెకు నాకె నిన్నుఁ గొసరి పాడీఁగాని

(॥ఇన్ని॥)
తొలుత నీకొలఁకుల తుమ్మిదలు గావుసుమీ
సొలసి చూచిన యాపె చూపులుగాని
చలాన నీపై వాలిన జక్కవలు గావుసుమీ
కులికి నిన్నొరసేటి గుబ్బలుగాని

(॥ఇన్ని॥)
తతి నీపావురాల రొద లివి గావుసుమీ
రతి నాపె మదనమంత్రములుగాని
యితవుగా శ్రీవేంకటేశ యింతిఁగూడితివి
మతకారి గాదుసుమీ మంచి రాయంచగాని

(||pallavi||)
inni saṁdālagu guri yī vanidayai vunnadi
yĕnnugŏni veḍugado neluduvugāni

(||inni||)
seri nīvu vĕṁchina siluga gādusumī
perugŏni nī devulu pilisīm̐gāni
kūrimi nīvanamulo kovila gādusumī
sārĕgu nāgĕ ninnum̐ gŏsari pāḍīm̐gāni

(||inni||)
tŏluda nīgŏlam̐kula tummidalu gāvusumī
sŏlasi sūsina yābĕ sūbulugāni
salāna nībai vālina jakkavalu gāvusumī
kuligi ninnŏraseḍi gubbalugāni

(||inni||)
tadi nībāvurāla rŏda livi gāvusumī
radi nābĕ madanamaṁtramulugāni
yidavugā śhrīveṁkaḍeśha yiṁtim̐gūḍidivi
madagāri gādusumī maṁchi rāyaṁchagāni