Inni saginamulu yimtigi melu

ఇన్ని సగినములు యింతికి మేలు
Language

(॥పల్లవి॥)
ఇన్ని సగినములు యింతికి మేలు
విన్న కన్న చెలు లెల్లా వెఱవకురమ్మా

(॥ఇన్ని॥)
విరహతాపముచేత విసిగిన చెలియకు
వెరవునఁ జల్లగాలి వీపు గాపు
సరుస నిండుమనసు చంచల మైనందుకు
యిరవైన కోవిలల యెలుపే నిలుపు

(॥ఇన్ని॥)
వలపుల చింతచేత వడి బడ్దఁ మగువకు
చెలఁగి మోన్నెలఱేని చిచ్చేసిరి
నిలిచి విభునివద్ద నెయ్మము చల్లేవేళ
తెలిఁజన్నుజక్కవల తీరే మిక్కిలి

(॥ఇన్ని॥)
గక్కనఁగూడిన శ్రీవేంకటపతి రతివేళ
గుక్కని చిలుకపలుకులే దిక్కు
పక్కన నితనిమీఁది పాటలు వాడుటకు
వొక్కటఁ దుమ్మెదమోఁత వుపశ్రుతులు

(||pallavi||)
inni saginamulu yiṁtigi melu
vinna kanna sĕlu lĕllā vĕṟavagurammā

(||inni||)
virahadābamuseda visigina sĕliyagu
vĕravunam̐ jallagāli vību gābu
sarusa niṁḍumanasu saṁchala mainaṁdugu
yiravaina kovilala yĕlube nilubu

(||inni||)
valabula siṁtaseda vaḍi baḍdam̐ maguvagu
sĕlam̐gi monnĕlaṟeni sichchesiri
nilisi vibhunivadda nĕymamu salleveḽa
tĕlim̐jannujakkavala tīre mikkili

(||inni||)
gakkanam̐gūḍina śhrīveṁkaḍabadi radiveḽa
gukkani silugabalugule dikku
pakkana nidanimīm̐di pāḍalu vāḍuḍagu
vŏkkaḍam̐ dummĕdamom̐ta vubaśhrudulu