ఇన్ని నేరుపులు నీయెదుటనే పచరించీ
(॥పల్లవి॥)
ఇన్ని నేరుపులు నీయెదుటనే పచరించీ
సన్నలనే నీవీకెను సంతోసించవయ్యా
(॥ఇన్ని॥)
వలిపె పయ్యెదతోడ వట్రువగుబ్బలతోడ
కొలువుసేసీ నదె కొమ్మ నీకును
సెలవుల నవ్వుదేర చెమట చెక్కులఁగార
తెలిపీఁ దలవలపు తేరిచూడవయ్యా
(॥ఇన్ని॥)
వాసనపూఁతలు పూసి వన్నెలకుచ్చెల వోసి
ఆసలురేఁచీ నదె యంగన నీకు
లాసేటిచూపులు చూపి లలిఁ గొనగోరుమోపి
సేసీఁ దనచేఁతలు చిత్తగించవయ్యా
(॥ఇన్ని॥)
వాడికలఁ జెలరేఁగి వంతుల నేతులఁ దూఁగి
వీడెము చేతికిచ్చీ వెలఁది నీకు
యాడనే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
తోడనె తానూఁ గూడీ పొందులు సేయవయ్యా
(||pallavi||)
inni nerubulu nīyĕduḍane pasariṁchī
sannalane nīvīgĕnu saṁtosiṁchavayyā
(||inni||)
valibĕ payyĕdadoḍa vaṭruvagubbaladoḍa
kŏluvusesī nadĕ kŏmma nīgunu
sĕlavula navvudera sĕmaḍa sĕkkulam̐gāra
tĕlibīm̐ dalavalabu terisūḍavayyā
(||inni||)
vāsanabūm̐talu pūsi vannĕlaguchchĕla vosi
āsalurem̐sī nadĕ yaṁgana nīgu
lāseḍisūbulu sūbi lalim̐ gŏnagorumobi
sesīm̐ danasem̐talu sittagiṁchavayyā
(||inni||)
vāḍigalam̐ jĕlarem̐gi vaṁtula nedulam̐ dūm̐gi
vīḍĕmu sedigichchī vĕlam̐di nīgu
yāḍane śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
toḍanĕ tānūm̐ gūḍī pŏṁdulu seyavayyā