Inni gurudulu needo neege vinnavimchumane

ఇన్ని గురుతులు నీతో నీకె విన్నవించుమనె
Language

(॥పల్లవి॥)
ఇన్ని గురుతులు నీతో నీకె విన్నవించుమనె
వున్న దిదె తెరలోన నొద్దికాయఁ బనులు

(॥ఇన్ని॥)
వనితతో నీ వేమో వావులు చెప్పితివట
చెనకుతా నేమేమో సేసితివట
వొనరఁగ నీ వేలివంగర మిచ్చితివట
యెనసెఁ జుట్టరికము లింటికి రమ్మనెను

(॥ఇన్ని॥)
సముఖాన నుండఁగానే సన్నలు సేసితివట
చెమటలు కొనగోరఁ జిమ్మితివట
తమకించి కుచములు తప్పక చూచితివట
అమరు నన్నిటా సమ్మతాయను రమ్మనెను

(॥ఇన్ని॥)
వేడుకతోఁ జెలులచే వీడె మిప్పించితివట
జోడుగాఁ బెనఁగులాడి చొక్కితివట
యీడకు వచ్చి శ్రీవేంకటేశ యలమేల్మంగను
కూడితివట దినము గొంకక రమ్మనెను

(||pallavi||)
inni gurudulu nīdo nīgĕ vinnaviṁchumanĕ
vunna didĕ tĕralona nŏddigāyam̐ banulu

(||inni||)
vanidado nī vemo vāvulu sĕppidivaḍa
sĕnagudā nememo sesidivaḍa
vŏnaram̐ga nī velivaṁgara michchidivaḍa
yĕnasĕm̐ juṭṭarigamu liṁṭigi rammanĕnu

(||inni||)
samukhāna nuṁḍam̐gāne sannalu sesidivaḍa
sĕmaḍalu kŏnagoram̐ jimmidivaḍa
tamagiṁchi kusamulu tappaga sūsidivaḍa
amaru nanniḍā sammadāyanu rammanĕnu

(||inni||)
veḍugadom̐ jĕlulase vīḍĕ mippiṁchidivaḍa
joḍugām̐ bĕnam̐gulāḍi sŏkkidivaḍa
yīḍagu vachchi śhrīveṁkaḍeśha yalamelmaṁganu
kūḍidivaḍa dinamu gŏṁkaga rammanĕnu