ఇన్ని గుణాలవాఁడ వేమని నుతింతు నిన్ను
(॥పల్లవి॥)
ఇన్ని గుణాలవాఁడ వేమని నుతింతు నిన్ను
వన్నెకెక్క నేలితివి వలచితి నీకును
(॥ఇన్ని॥)
మారుసవతులు రానిమను వొకటే మంచిది
గోరు దాఁకకుండాఁ గూడేకూటమి మేలు
బీరాలు పచరించని ప్రియముల మాట లెస్స
యీరీతి నేలేరమణుఁ డిన్నిటాను జాణ
(॥ఇన్ని॥)
సొలసి యెగ్గుపట్టని చుట్టిరిక మెక్కుడు
అలుగని సంగాత మది యరుదు
చలము సాదించని సరసమే యబ్బురము
కలసి యిట్టున్న యట్టి కాంతుఁడే జాణ
(॥ఇన్ని॥)
మాట మీరకుండేటి మచ్చిక చెప్పరానిది
యీటు వెట్టని కొండాట మిన్నిటా మెచ్చు
గాఁటాన శ్రీవేంకటేశ గక్కన నన్నేలితివి
వాఁటముగ నెప్పుడూ నీవంటి వాఁడే జాణ
(||pallavi||)
inni guṇālavām̐ḍa vemani nudiṁtu ninnu
vannĕgĕkka nelidivi valasidi nīgunu
(||inni||)
mārusavadulu rānimanu vŏgaḍe maṁchidi
goru dām̐kaguṁḍām̐ gūḍegūḍami melu
bīrālu pasariṁchani priyamula māḍa lĕssa
yīrīdi neleramaṇum̐ ḍinniḍānu jāṇa
(||inni||)
sŏlasi yĕggubaṭṭani suṭṭiriga mĕkkuḍu
alugani saṁgāda madi yarudu
salamu sādiṁchani sarasame yabburamu
kalasi yiṭṭunna yaṭṭi kāṁtum̐ḍe jāṇa
(||inni||)
māḍa mīraguṁḍeḍi machchiga sĕpparānidi
yīḍu vĕṭṭani kŏṁḍāḍa minniḍā mĕchchu
gām̐ṭāna śhrīveṁkaḍeśha gakkana nannelidivi
vām̐ṭamuga nĕppuḍū nīvaṁṭi vām̐ḍe jāṇa