Innesimaadalu needo nimka nelaa

ఇన్నేసిమాటలు నీతో నిఁక నేలా
Language

(॥పల్లవి॥)
ఇన్నేసిమాటలు నీతో నిఁక నేలా
కన్నుల నీవు చూచేటి కడ మింతేకాక

(॥ఇన్నే॥)
మరుఁడు వ్రాసినవ్రాఁత మానిని నొసల నదె
కరఁగి చెదరినట్టికస్తూరిబొట్టు
సరసపుఁబతివి నీజాడ లిట్టివయ్యా
పరగఁ జూచేచెలుల భాగ్య మింతేకాక

(॥ఇన్నే॥)
ముదిత నోచిననోము ముక్కునఁబంటాయ నదె
వుదుటు మించినవి నిట్టూరుపులు
వదలనినీలోనివల పమి సేయనయ్య
కదిసి మనసులోనఁ గలయంతేకాక

(॥ఇన్నే॥)
చెప్పేటివారిచేత దిష్టమాయ నదె
నెప్పున నింతికాఁగిట నీ వుండఁగా
చిప్పిల శ్రీవేంకటేశ చేఁత లేమి సేయునయ్య
తప్పరానిమీఁదిమీఁదితమకమో కాక

(||pallavi||)
innesimāḍalu nīdo nim̐ka nelā
kannula nīvu sūseḍi kaḍa miṁtegāga

(||inne||)
marum̐ḍu vrāsinavrām̐ta mānini nŏsala nadĕ
karam̐gi sĕdarinaṭṭigastūribŏṭṭu
sarasabum̐badivi nījāḍa liṭṭivayyā
paragam̐ jūsesĕlula bhāgya miṁtegāga

(||inne||)
mudida nosinanomu mukkunam̐baṁṭāya nadĕ
vuduḍu miṁchinavi niṭṭūrubulu
vadalaninīlonivala pami seyanayya
kadisi manasulonam̐ galayaṁtegāga

(||inne||)
sĕppeḍivāriseda diṣhṭamāya nadĕ
nĕppuna niṁtigām̐giḍa nī vuṁḍam̐gā
sippila śhrīveṁkaḍeśha sem̐ta lemi seyunayya
tapparānimīm̐dimīm̐didamagamo kāga