Innesi vaavulado nimdaribaalam galige

ఇన్నేసి వావులతో నిందరిపాలఁ గలిగె
Language

(॥పల్లవి॥)
ఇన్నేసి వావులతో నిందరిపాలఁ గలిగె
పిన్నపెద్దై మేలుసేసీ పెంచరే యీబాలుని

(॥॥)
నరకారునితండ్రి నడురేయి జనియించె
అరుదుగఁ గంసుని కల్లుఁడాయను
నిరతి శిశుపాలుని నెయ్యపు మఱఁది వుట్టె
పెరుగఁగా మేలుసేసీ పెంచరే యీబాలుని

(॥॥)
వొద్దిక పాండవులకు నుదయించె మేనబావ
బుద్దితో వసుదేవునిపుత్రుఁడాయను
వుద్దండపు గొల్లెతల కొగి మగఁడు గలిగె
పెద్దవాఁడై మేలు సేసీ పెంచరే యీబాలుని

(॥॥)
నేరనిదుష్టులకెల్లా నిండుచిచ్చరపిడుగు
నేరిచినశిష్టులకు నిధానము
యీరీతి శ్రీ వేంకటేశుఁ డితడె బాలకృష్ణుఁడు
పేరడిగా మేలు సేసీ పెంచరే యీబాలుని

(||pallavi||)
innesi vāvulado niṁdaribālam̐ galigĕ
pinnabĕddai melusesī pĕṁchare yībāluni

(||||)
naragārunidaṁḍri naḍureyi janiyiṁchĕ
arudugam̐ gaṁsuni kallum̐ḍāyanu
niradi śhiśhubāluni nĕyyabu maṟam̐di vuṭṭĕ
pĕrugam̐gā melusesī pĕṁchare yībāluni

(||||)
vŏddiga pāṁḍavulagu nudayiṁchĕ menabāva
buddido vasudevunibutrum̐ḍāyanu
vuddaṁḍabu gŏllĕdala kŏgi magam̐ḍu galigĕ
pĕddavām̐ḍai melu sesī pĕṁchare yībāluni

(||||)
neraniduṣhṭulagĕllā niṁḍusichcharabiḍugu
nerisinaśhiṣhṭulagu nidhānamu
yīrīdi śhrī veṁkaḍeśhum̐ ḍidaḍĕ bālakṛṣhṇum̐ḍu
peraḍigā melu sesī pĕṁchare yībāluni