ఇన్నేసి పనుల కెల్లా నియ్యకొన నోపుదుమా
(॥పల్లవి॥)
ఇన్నేసి పనుల కెల్లా నియ్యకొన నోపుదుమా
చెన్నుమీర మాభాగ్యము చిత్తము నీదిగాక
(॥ఇన్నే॥)
నీ వెఱఁగనిబుద్దులు నే విన్న వించేనా
దేవులనీమంకులు నేఁ దిప్పఁగలవా
నావంక నేమి చూచేవు నవ్వు లేమినవ్వేవు
కావలసినపను లిక్కడ నయ్యీఁగాక
(॥ఇన్నే॥)
ఘనుఁడ వింతటినిన్నుఁగడుబలిమి సేసేమా
వనితనీసందిమాఁట వంక లొత్తేమా
తను వేమినిమి రేవు తగవు లే మడిగేవు
అనువులు వచ్చి నప్పుడందమయ్యీఁగాక
(॥ఇన్నే॥)
శ్రీవేంకటేశుఁడ నీచేఁతకు మెచ్చేమా
భావించి యాపఁ గూడితి బా సడిగేమా
వేవేలు నేమి చెప్పివు వెల్లవి రేమి సేసేవు
చేవదేరినవిధాలు చెప్పిచూపేఁ గాక
(||pallavi||)
innesi panula kĕllā niyyagŏna nobudumā
sĕnnumīra mābhāgyamu sittamu nīdigāga
(||inne||)
nī vĕṟam̐ganibuddulu ne vinna viṁchenā
devulanīmaṁkulu nem̐ dippam̐galavā
nāvaṁka nemi sūsevu navvu leminavvevu
kāvalasinabanu likkaḍa nayyīm̐gāga
(||inne||)
ghanum̐ḍa viṁtaḍininnum̐gaḍubalimi sesemā
vanidanīsaṁdimām̐ṭa vaṁka lŏttemā
tanu veminimi revu tagavu le maḍigevu
anuvulu vachchi nappuḍaṁdamayyīm̐gāga
(||inne||)
śhrīveṁkaḍeśhum̐ḍa nīsem̐tagu mĕchchemā
bhāviṁchi yābam̐ gūḍidi bā saḍigemā
vevelu nemi sĕppivu vĕllavi remi sesevu
sevaderinavidhālu sĕppisūbem̐ gāga