Inneem joosevugaaga yela ninnu rattuseya

ఇన్నీఁ జూచేవుగాక యేల నిన్ను రట్టుసేయ
Language

(॥పల్లవి॥)
ఇన్నీఁ జూచేవుగాక యేల నిన్ను రట్టుసేయ
పన్ని సీత కొక్కెతకే బతిమి సేసుకోవా

(॥ఇన్నీ॥)
చెంతల నన్నేకాని చెలులఁ గైకొననంటా
పంతములాడుకొనవా పలుమారును
మంతుకెక్కి నీ వప్పటి మఱచితివేమోకాక
వింతసతులఁ బదారువేలఁ జేకొనవా

(॥ఇన్నీ॥)
నాకే మోహించితిగాని నాతుల బెండ్లాడనంటా
సాకిరులు వెట్టేవా సతులనెల్లా
పైకొని యేకడ నీవు పరాకైతివేమోకాని
కాకుగాఁ బురాంగనలఁ గతలఁ గఱపవా

(॥ఇన్నీ॥)
కమ్మి నాకాఁగిటఁ గూడి కాంతల నటంనంటా
యెమ్మెలెల్లా నెఱపవా యిప్పుడే నాతో
పమ్మి శ్రీవేంకటేశ్వర భ్రమసితివేమోకాని
కొమ్మలైనగొల్లెతలఁ గూడి చెలఁగవా

(||pallavi||)
innīm̐ jūsevugāga yela ninnu raṭṭuseya
panni sīda kŏkkĕdage badimi sesugovā

(||innī||)
sĕṁtala nannegāni sĕlulam̐ gaigŏnanaṁṭā
paṁtamulāḍugŏnavā palumārunu
maṁtugĕkki nī vappaḍi maṟasidivemogāga
viṁtasadulam̐ badāruvelam̐ jegŏnavā

(||innī||)
nāge mohiṁchidigāni nādula bĕṁḍlāḍanaṁṭā
sāgirulu vĕṭṭevā sadulanĕllā
paigŏni yegaḍa nīvu parāgaidivemogāni
kāgugām̐ burāṁganalam̐ gadalam̐ gaṟabavā

(||innī||)
kammi nāgām̐giḍam̐ gūḍi kāṁtala naḍaṁnaṁṭā
yĕmmĕlĕllā nĕṟabavā yippuḍe nādo
pammi śhrīveṁkaḍeśhvara bhramasidivemogāni
kŏmmalainagŏllĕdalam̐ gūḍi sĕlam̐gavā