ఇన్నీఁ గన్నవే నేము ఇంకాఁ గొన్నేలరా
(॥పల్లవి॥)
ఇన్నీఁ గన్నవే నేము ఇంకాఁ గొన్నేలరా
పన్నిన నీ సటలేల పదరా ఇంటికిని
(॥॥)
పంతపు నడుములను బయలీఁదే వారము
ఇంతేనిమాటల బయలీఁదించేవా
బంతిఁ దొల్ల జవ్వనపు భారముల వారము
రంతుల నీమోహపుభారము గొంత గట్టేవా
(॥॥)
గొబ్బునఁ బెరిగేచనుఁగొండలలో వారము
వుబ్బించి కొండ లెక్కించే వూరకే నీవు
దొబ్బరాని చీఁకటి తురముల వారము
తబ్బిబ్బుఁగాఁగలజీకు తవ్వించేనా నీవు
(॥॥)
బచ్చనల సిగ్గుల చప్పరములో వారము
యిచ్చఁ జప్పరానకు నన్నిటు దీసేవా
మెచ్చి శ్రీ వేంకటేశుఁడ మిమ్ముఁ గూడిన వారము
నిచ్చలుఁ బైకొని నన్ను నీవూఁ గూడేవా
(||pallavi||)
innīm̐ gannave nemu iṁkām̐ gŏnnelarā
pannina nī saḍalela padarā iṁṭigini
(||||)
paṁtabu naḍumulanu bayalīm̐de vāramu
iṁtenimāḍala bayalīm̐diṁchevā
baṁtim̐ dŏlla javvanabu bhāramula vāramu
raṁtula nīmohabubhāramu gŏṁta gaṭṭevā
(||||)
gŏbbunam̐ bĕrigesanum̐gŏṁḍalalo vāramu
vubbiṁchi kŏṁḍa lĕkkiṁche vūrage nīvu
dŏbbarāni sīm̐kaḍi turamula vāramu
tabbibbum̐gām̐galajīgu tavviṁchenā nīvu
(||||)
bachchanala siggula sapparamulo vāramu
yichcham̐ japparānagu nanniḍu dīsevā
mĕchchi śhrī veṁkaḍeśhum̐ḍa mimmum̐ gūḍina vāramu
nichchalum̐ baigŏni nannu nīvūm̐ gūḍevā