ఇన్నాళ్లుఁ బిన్నదాన వెరఁగవంటా నుంటిమి
(॥పల్లవి॥)
ఇన్నాళ్లుఁ బిన్నదాన వెరఁగవంటా నుంటిమి
నిన్నా మొన్నాఁ గతలెల్లా నేరుచుకొంటివే
(॥ఇన్నా॥)
సరసము లాడుతానే చనవులు మెరసేవు
శిరసు వంచి నవ్వుతాఁ చేయి చాఁచేవు
తెర వేసుకొంటానే తీగె సాగ మాటాడేవు
అరుదుగ మాలో నీవు నైతివె జాణవు
(॥ఇన్నా॥)
సన్నలలోనే మోవిచవులెల్లాఁ జూపేవు
కన్ను లార్చుకొంటానే బింకము చూపేవు
విన్నపాలు చేసి చేసి వేడుకలు రేఁచేవు
అన్నిటాఁ బరగి నేఁడే అయితివే జాణవు
(॥ఇన్నా॥)
పాదాలు గుద్దుతానే పానుపుపైఁ గూచుండేవు
సాదువలె నుండుతా సేసలు చల్లేవు
యీదె శ్రీవేంకటేశుఁ డితఁడె నన్నిటు గూడె
ఆదిగొని నీవు మెచ్చే వౌదువే జాణవు
(||pallavi||)
innāḽlum̐ binnadāna vĕram̐gavaṁṭā nuṁṭimi
ninnā mŏnnām̐ gadalĕllā nerusugŏṁṭive
(||innā||)
sarasamu lāḍudāne sanavulu mĕrasevu
śhirasu vaṁchi navvudām̐ seyi sām̐sevu
tĕra vesugŏṁṭāne tīgĕ sāga māḍāḍevu
aruduga mālo nīvu naidivĕ jāṇavu
(||innā||)
sannalalone movisavulĕllām̐ jūbevu
kannu lārsugŏṁṭāne biṁkamu sūbevu
vinnabālu sesi sesi veḍugalu rem̐sevu
anniḍām̐ baragi nem̐ḍe ayidive jāṇavu
(||innā||)
pādālu guddudāne pānububaim̐ gūsuṁḍevu
sāduvalĕ nuṁḍudā sesalu sallevu
yīdĕ śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍĕ nanniḍu gūḍĕ
ādigŏni nīvu mĕchche vauduve jāṇavu