ఇన్నాళ్లుఁ బడుచ వేమీ నెరఁగవంటా నుంటిమి
(॥పల్లవి॥)
ఇన్నాళ్లుఁ బడుచ వేమీ నెరఁగవంటా నుంటిమి
కన్నులారా నీయందుఁ గంటిమి వేడుకలు
(॥ఇన్నా॥)
చెలరేఁగి లోలోనే చిరునవ్వులు నవ్వేవు
వలపులతలపోఁతవరుసా ఇది
అలయుచు సొలయుచు నసురుసురయ్యేవు
కొలఁదీరినరతికోరికా ఇది
(॥ఇన్నా॥)
చిట్టంటుఁ జెమటలతో సిగ్గువడేవు నీవు
దట్టమైనపాయపుమదములా ఇది
గుట్టుతోడఁ బులకల గుబ్బతిల్లే విప్పు డిట్టె
మట్టు లేనితమకపుమర్మమా యిది
(॥ఇన్నా॥)
యీడనే పానుపుమీఁద నెదురులు చూచేవు
కూడేటి ఆసలకెల్లా గురుతా ఇది
పాడితో శ్రీవేంకటపతి నిన్ను నన్ను నేలె
వేడుకఁ జూచేవు వెల్లవిరులా యిది
(||pallavi||)
innāḽlum̐ baḍusa vemī nĕram̐gavaṁṭā nuṁṭimi
kannulārā nīyaṁdum̐ gaṁṭimi veḍugalu
(||innā||)
sĕlarem̐gi lolone sirunavvulu navvevu
valabuladalabom̐tavarusā idi
alayusu sŏlayusu nasurusurayyevu
kŏlam̐dīrinaradigorigā idi
(||innā||)
siṭṭaṁṭum̐ jĕmaḍalado sigguvaḍevu nīvu
daṭṭamainabāyabumadamulā idi
guṭṭudoḍam̐ bulagala gubbadille vippu ḍiṭṭĕ
maṭṭu lenidamagabumarmamā yidi
(||innā||)
yīḍane pānubumīm̐da nĕdurulu sūsevu
kūḍeḍi āsalagĕllā gurudā idi
pāḍido śhrīveṁkaḍabadi ninnu nannu nelĕ
veḍugam̐ jūsevu vĕllavirulā yidi