ఇన్నాళ్లులేని గుణ మేడనుండి వచ్చె నీకు
(॥పల్లవి॥)
ఇన్నాళ్లులేని గుణ మేడనుండి వచ్చె నీకు
చెన్నుమీర వినేఁగాని చెప్పవయ్య నాకును
(॥ఇన్నా॥)
చెలరేఁగి చెలరేఁగి చేతులు చాఁచేవు నాపై
మలసి యిచ్చటనే సుమాళ మెత్తెనో
పిలువదాయనో నిన్ను ప్రియురాలు యీవేళ
బలుపాయపు మదము పట్టరాదో నీకు
(॥ఇన్నా॥)
సారెసారె నాతోనే సరసములాడేవు
మేరతో వీడెపుచొక్కు మేననుబ్బెనో
చేరనీక వనితలు చేతుల నిన్ను దొబ్బిరో
ఆరీతి రతులమీఁది ఆసోదమో
(॥ఇన్నా॥)
కమ్ముకొని నన్నునిట్టె కాఁగిలించి కూడేవు
రమ్మా నాపైవలపు శిరసు కెక్కెనో
ఇమ్ముల శ్రీవేంకటేశ యెవ్వతైన నిన్నంపెనో
నెమ్మది నాపై మన్నన నిజమో యిపుడు
(||pallavi||)
innāḽluleni guṇa meḍanuṁḍi vachchĕ nīgu
sĕnnumīra vinem̐gāni sĕppavayya nāgunu
(||innā||)
sĕlarem̐gi sĕlarem̐gi sedulu sām̐sevu nābai
malasi yichchaḍane sumāḽa mĕttĕno
piluvadāyano ninnu priyurālu yīveḽa
balubāyabu madamu paṭṭarādo nīgu
(||innā||)
sārĕsārĕ nādone sarasamulāḍevu
merado vīḍĕbusŏkku menanubbĕno
seranīga vanidalu sedula ninnu dŏbbiro
ārīdi radulamīm̐di āsodamo
(||innā||)
kammugŏni nannuniṭṭĕ kām̐giliṁchi kūḍevu
rammā nābaivalabu śhirasu kĕkkĕno
immula śhrīveṁkaḍeśha yĕvvadaina ninnaṁpĕno
nĕmmadi nābai mannana nijamo yibuḍu