ఇన్నాళ్ళు తానెందుండెనో యేమని చెప్పేము నేము
(॥పల్లవి॥)
ఇన్నాళ్ళు తానెందుండెనో యేమని చెప్పేము నేము
సన్నలు సేయఁగఁ జూచి చలము మీరేమయ్యా
(॥ఇన్నా॥)
జలజాక్షి నీతోను సారె విన్నపాలు సేసీ
యెలమి నీవెంత చనవిచ్చితో కాని
కలకల నవ్వుతాను కందువలు నీకుఁ జూపీ
వెలయ మాకు నేఁడు వెరగయ్యీనయ్యా
(॥ఇన్నా॥)
కన్నుల కలికి నీకు కానుకలందిచ్చీని
నిన్నా నేఁడే యెంత మన్నించితో కాని
చన్నుల నొరసుతాను సంగడినే కూచుండీ
వన్నెల నిందుకే మాకు వాసి వుట్టీనయ్యా
(॥ఇన్నా॥)
జవరాలు నీమోవిచవి నీకుఁ జెప్పీని
భువి నేర్పు లెంత నూరి పోసితో కాని
యివల శ్రీవేంకటేశ ఇన్నిటాను నిన్నుఁ గూడె
తవిలి నన్నేలితివి తగవాయనయ్యా
(||pallavi||)
innāḽḽu tānĕṁduṁḍĕno yemani sĕppemu nemu
sannalu seyam̐gam̐ jūsi salamu mīremayyā
(||innā||)
jalajākṣhi nīdonu sārĕ vinnabālu sesī
yĕlami nīvĕṁta sanavichchido kāni
kalagala navvudānu kaṁduvalu nīgum̐ jūbī
vĕlaya māgu nem̐ḍu vĕragayyīnayyā
(||innā||)
kannula kaligi nīgu kānugalaṁdichchīni
ninnā nem̐ḍe yĕṁta manniṁchido kāni
sannula nŏrasudānu saṁgaḍine kūsuṁḍī
vannĕla niṁduge māgu vāsi vuṭṭīnayyā
(||innā||)
javarālu nīmovisavi nīgum̐ jĕppīni
bhuvi nerbu lĕṁta nūri posido kāni
yivala śhrīveṁkaḍeśha inniḍānu ninnum̐ gūḍĕ
tavili nannelidivi tagavāyanayyā