Innaallu nimta yeṟamga vippude nersugomtivi

ఇన్నాళ్లు నింత యెఱఁగ విప్పుడే నేర్చుకొంటివి
Language

(॥పల్లవి॥)
ఇన్నాళ్లు నింత యెఱఁగ విప్పుడే నేర్చుకొంటివి
చిన్నదానవై ప్రియము చెప్పించుకోవలెనా

(॥ఇన్నా॥)
మక్కువల నీవు నాతో మాటలాడినంతలోనె
చిక్కని మోవితేనె చిందీనటవే
చెక్కుచేతితోడ వట్టిసిగ్గులువడే వప్పటి
యెక్కుడుగా నిందువల్ల నేమి గూడపెట్టేవే

(॥ఇన్నా॥)
నాతో నీవంగవించి నవ్వు నవ్వితే నేమాయ
ఆతల నీవాసి గొంత అరగీనటే
కాతరించి చెలులతో కడునేకాంతా లాడేవు
యేతుల నేకాలము నీకివే వోజలటవే

(॥ఇన్నా॥)
యింకనైనా నేనన్నట్టె యియ్యకొనఁగదవే
జకించి నీతోడివారు జరసేరటే
అంకెల శ్రీవేంకటేవుఁ డలమేల్మంగవు నీవు
లంకెలఁ గూడితివి ఈలాగు లివే మేలే

(||pallavi||)
innāḽlu niṁta yĕṟam̐ga vippuḍe nersugŏṁṭivi
sinnadānavai priyamu sĕppiṁchugovalĕnā

(||innā||)
makkuvala nīvu nādo māḍalāḍinaṁtalonĕ
sikkani movidenĕ siṁdīnaḍave
sĕkkusedidoḍa vaṭṭisigguluvaḍe vappaḍi
yĕkkuḍugā niṁduvalla nemi gūḍabĕṭṭeve

(||innā||)
nādo nīvaṁgaviṁchi navvu navvide nemāya
ādala nīvāsi gŏṁta aragīnaḍe
kādariṁchi sĕlulado kaḍunegāṁtā lāḍevu
yedula negālamu nīgive vojalaḍave

(||innā||)
yiṁkanainā nenannaṭṭĕ yiyyagŏnam̐gadave
jagiṁchi nīdoḍivāru jaraseraḍe
aṁkĕla śhrīveṁkaḍevum̐ ḍalamelmaṁgavu nīvu
laṁkĕlam̐ gūḍidivi īlāgu live mele