ఇన్నాళ్ళు నెఱఁగవైతి వేమీ నీవు
(॥పల్లవి॥)
ఇన్నాళ్ళు నెఱఁగవైతి వేమీ నీవు
కన్నుసన్న దొరకొంటి కడవారి మీఁదను
(॥ఇన్నా॥)
చలివాసి నవ్వితివి సతితో నేఁజూడఁగానే
యెలమి నింతగాలాన కేమీ నీవు
తెలిసె నీమోహమెల్ల తీగెలువారఁ దొడఁగె
కలగఁ పై నలువంక కన్నవారిమీఁదను
(॥ఇన్నా॥)
బత్తితో మాటాడితివి భామతో నాయింటనే
యిత్తుల నెన్నఁడు లేని దేమీ నీవు
చిత్తణి నీగుణ మెల్ల చిగుళ్లు వెళ్లఁదొడఁగె
అత్తి వసంతవేళ అండవారిమీఁదను
(॥ఇన్నా॥)
తొడ పై నిడుకొంటివి తొయ్యలిని నావొద్దనే
యెడపు శ్రీ వేంకటేశ యేమీ నీవు
కడగి నన్ను గూడి నీ కాయమెల్ల నన లెత్తె
అడియాలమై నీ మోహపు వారి మీదను
(||pallavi||)
innāḽḽu nĕṟam̐gavaidi vemī nīvu
kannusanna dŏragŏṁṭi kaḍavāri mīm̐danu
(||innā||)
salivāsi navvidivi sadido nem̐jūḍam̐gāne
yĕlami niṁtagālāna kemī nīvu
tĕlisĕ nīmohamĕlla tīgĕluvāram̐ dŏḍam̐gĕ
kalagam̐ pai naluvaṁka kannavārimīm̐danu
(||innā||)
battido māḍāḍidivi bhāmado nāyiṁṭane
yittula nĕnnam̐ḍu leni demī nīvu
sittaṇi nīguṇa mĕlla siguḽlu vĕḽlam̐dŏḍam̐gĕ
atti vasaṁtaveḽa aṁḍavārimīm̐danu
(||innā||)
tŏḍa pai niḍugŏṁṭivi tŏyyalini nāvŏddane
yĕḍabu śhrī veṁkaḍeśha yemī nīvu
kaḍagi nannu gūḍi nī kāyamĕlla nana lĕttĕ
aḍiyālamai nī mohabu vāri mīdanu