ఇన్నాళ్ళు నెరఁగము యిటువంటి మచ్చికలు
(॥పల్లవి॥)
ఇన్నాళ్ళు నెరఁగము యిటువంటి మచ్చికలు
సన్నసేసి మరీఁ గొంత చవులు వుట్టించెనో
(॥ఇన్నా॥)
చెలరేఁగి యాపె నీకు జెప్పనో బుద్దులెల్లా
మలసి యిప్పుడు నాతో మాఁటలాడేవు
తలపోసి నామీఁద దయ నీకుఁ బుట్టించెనో
వలచి కాచుకొని నావద్ద నుండుమనుచు
(॥ఇన్నా॥)
నెమ్మది నేకతమున నీకు నిట్టె నేరిపెనో
చిమ్ముచుఁ గాఁగిట నన్నుఁ జెనకు మనీ
నమ్మికగఁ దనపై నానలు వెట్టించుకొనెనొ
సమ్మతించి నాతో సరసములాడు మనుచు
(॥ఇన్నా॥)
సారె సారెఁ దా నీకు సాగిలి మొక్కు మొక్కెనో
కూరిమి నన్నుఁ గాఁగిటఁ గూడు మనుచు
యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
తారుకాణించ వచ్చెనో తానే నే ననుచు
(||pallavi||)
innāḽḽu nĕram̐gamu yiḍuvaṁṭi machchigalu
sannasesi marīm̐ gŏṁta savulu vuṭṭiṁchĕno
(||innā||)
sĕlarem̐gi yābĕ nīgu jĕppano buddulĕllā
malasi yippuḍu nādo mām̐ṭalāḍevu
talabosi nāmīm̐da daya nīgum̐ buṭṭiṁchĕno
valasi kāsugŏni nāvadda nuṁḍumanusu
(||innā||)
nĕmmadi negadamuna nīgu niṭṭĕ neribĕno
simmusum̐ gām̐giḍa nannum̐ jĕnagu manī
nammigagam̐ danabai nānalu vĕṭṭiṁchugŏnĕnŏ
sammadiṁchi nādo sarasamulāḍu manusu
(||innā||)
sārĕ sārĕm̐ dā nīgu sāgili mŏkku mŏkkĕno
kūrimi nannum̐ gām̐giḍam̐ gūḍu manusu
yīrīdi śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
tārugāṇiṁcha vachchĕno tāne ne nanusu