ఇన్నాళ్లు నెఱఁగము ఇంతలేసి పనులు
(॥పల్లవి॥)
ఇన్నాళ్లు నెఱఁగము ఇంతలేసి పనులు
సన్నల చాయలనే సతమాయ వావులు
(॥ఇన్నా॥)
పాటపాట సిగ్గులతో పఁడతి నీవు నవ్వఁగ
తేటతెల్లమాయను మీతెఱగుఁలెల్లా
మాటమాటలను మీరు మర్మాలు సోఁకనాడఁగా
వాటమాయ మీలోనివాడికవలపులు
(॥ఇన్నా॥)
వెడవెడ చూపు మీసై విచ్చనవిడిఁ బారఁగ
తడఁబడీ మీలోనితమకమెల్లా
చిడుముడితో మీరు చేతులుపైఁ జాఁచఁగాను
అడియాలాలాయను మీఅంకెలైనలంకెలు
(॥ఇన్నా॥)
పొద్దువొద్దు బాసలు గొబ్బున మీలోఁ జేయఁగాను
వొద్దికాయఁ గూటములు వొండురులలో
అద్దుక శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడఁగాను
సుద్దులాయఁ దొల్లి టినీ సొలపుల పొందులు
(||pallavi||)
innāḽlu nĕṟam̐gamu iṁtalesi panulu
sannala sāyalane sadamāya vāvulu
(||innā||)
pāḍabāḍa siggulado pam̐ḍadi nīvu navvam̐ga
teḍadĕllamāyanu mīdĕṟagum̐lĕllā
māḍamāḍalanu mīru marmālu som̐kanāḍam̐gā
vāḍamāya mīlonivāḍigavalabulu
(||innā||)
vĕḍavĕḍa sūbu mīsai vichchanaviḍim̐ bāram̐ga
taḍam̐baḍī mīlonidamagamĕllā
siḍumuḍido mīru sedulubaim̐ jām̐sam̐gānu
aḍiyālālāyanu mīaṁkĕlainalaṁkĕlu
(||innā||)
pŏdduvŏddu bāsalu gŏbbuna mīlom̐ jeyam̐gānu
vŏddigāyam̐ gūḍamulu vŏṁḍurulalo
adduga śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍam̐gānu
suddulāyam̐ dŏlli ṭinī sŏlabula pŏṁdulu