Innaallu neṟamgamaidi mimtadivaamdavauda

ఇన్నాళ్ళు నెఱఁగమైతి మింతటివాఁడవౌత
Language

(॥పల్లవి॥)
ఇన్నాళ్ళు నెఱఁగమైతి మింతటివాఁడవౌత
తిన్నగా నిప్పుడు చూచితిమిగా యీభాగ్యము

(॥ఇన్నా॥)
వేడుకతో నాపె నీకు విన్నపాలు సేయఁగాను
సూడిదెగా సారెసారె సొలయఁగాను
వాడికెతో నీమీఁద వలపులు చల్లఁగాను
నీడనుండే ఇన్నియుఁ గంటిమిగా యీభాగ్యము

(॥ఇన్నా॥)
కన్నులఁ దప్పక చూచి కానుక నీకియ్యఁగాను
సన్నలు సేసి యిట్టే జరయఁగాను
చన్నులు మోవఁగ నీసంగడిఁ గూచుండఁగాను
నిన్నాపె మెచ్చఁగాను కంటిమిగా యీభాగ్యము

(॥ఇన్నా॥)
చేరి కూడి నీతో నాపె సిగ్గునఁ దలవంచఁగా
కోరి నన్నంతలో నీవు గూడఁగాను
గారాపు శ్రీవేంకటేశ కడపలో నిద్దరికీ
నేరిపేవు రతులు కంటిమిగా యీభాగ్యము

(||pallavi||)
innāḽḽu nĕṟam̐gamaidi miṁtaḍivām̐ḍavauda
tinnagā nippuḍu sūsidimigā yībhāgyamu

(||innā||)
veḍugado nābĕ nīgu vinnabālu seyam̐gānu
sūḍidĕgā sārĕsārĕ sŏlayam̐gānu
vāḍigĕdo nīmīm̐da valabulu sallam̐gānu
nīḍanuṁḍe inniyum̐ gaṁṭimigā yībhāgyamu

(||innā||)
kannulam̐ dappaga sūsi kānuga nīgiyyam̐gānu
sannalu sesi yiṭṭe jarayam̐gānu
sannulu movam̐ga nīsaṁgaḍim̐ gūsuṁḍam̐gānu
ninnābĕ mĕchcham̐gānu kaṁṭimigā yībhāgyamu

(||innā||)
seri kūḍi nīdo nābĕ siggunam̐ dalavaṁcham̐gā
kori nannaṁtalo nīvu gūḍam̐gānu
gārābu śhrīveṁkaḍeśha kaḍabalo niddarigī
neribevu radulu kaṁṭimigā yībhāgyamu