ఇన్నాళ్లు నేడ నుండెనో యెవ్వరు నెఱఁగరు
(॥పల్లవి॥)
ఇన్నాళ్లు నేడ నుండెనో యెవ్వరు నెఱఁగరు
కన్నుల యెదుట నేఁడు గానబడెఁగాని
(॥॥)
యేమి గావలెనో కాని యీపె నీకు నెదురై
మోముకళలుదేరఁగ మొక్కె నిపుడు
చేముట్టి యీతినిఁ జేరి కాఁగిలించితివి
మీమీచుట్టరికము మేమిదివో కంటిమి
(॥॥)
యేవూరోకాని తాను నీ యింటికే వచ్చి బత్తితో
సేవలెల్లాఁ జేసితేను చెలఁగితివి
భావమెరిఁగి గందము పైఁబూసి నవ్వితివి
దోమటిఁమీయిద్దరిపొందులు నేఁడు గంటిమి
(॥॥)
తనుపే రేఁటిదోకాని తగిలి శ్రీవేంకటేశ
చెనకుచు నీపైఁ దాను సేసవెట్టెను
యెనసితి విటు నన్ను యే నలమేలుమంగను
నినుపులమీ ఇంపుల నేఁడు నేము గంటిమి
(||pallavi||)
innāḽlu neḍa nuṁḍĕno yĕvvaru nĕṟam̐garu
kannula yĕduḍa nem̐ḍu gānabaḍĕm̐gāni
(||||)
yemi gāvalĕno kāni yībĕ nīgu nĕdurai
momugaḽaluderam̐ga mŏkkĕ nibuḍu
semuṭṭi yīdinim̐ jeri kām̐giliṁchidivi
mīmīsuṭṭarigamu memidivo kaṁṭimi
(||||)
yevūrogāni tānu nī yiṁṭige vachchi battido
sevalĕllām̐ jesidenu sĕlam̐gidivi
bhāvamĕrim̐gi gaṁdamu paim̐būsi navvidivi
domaḍim̐mīyiddaribŏṁdulu nem̐ḍu gaṁṭimi
(||||)
tanube rem̐ṭidogāni tagili śhrīveṁkaḍeśha
sĕnagusu nībaim̐ dānu sesavĕṭṭĕnu
yĕnasidi viḍu nannu ye nalamelumaṁganu
ninubulamī iṁpula nem̐ḍu nemu gaṁṭimi