ఇన్నాళ్లు నందు నిందు యేమి గంటిని
(॥పల్లవి॥)
ఇన్నాళ్లు నందు నిందు యేమి గంటిని
అన్నిటా శరణు చొచ్చి హరి నిన్నుఁ గంటిని
(॥ఇన్నా॥)
అంగనల పసఁ జిక్కి అలయికలే కంటి
బంగారువెంటఁ దగిలి భ్రమ గంటిని
ముంగిటి క్షేత్రము లంటి ముంచి వెట్టి సేయఁ గంటి
అంగవించి నేఁ జూచి అంతరాత్మ గంటిని
(॥ఇన్నా॥)
చుట్టాలఁ జేరి చూచి సుద్దుల వావులు గంటి
మట్టులేని వయసుతో మదము గంటి
వట్టి కామ్యములు సేసి వరుస మాయలు గంటి
పట్టి నారాయణ యని భక్తి నిన్నుఁ గంటిని
(॥ఇన్నా॥)
వింత చదువులవల్ల వేరే మతములు గంటి
పంతపు కర్మమువల్ల పాపము గంటి
యింతట శ్రీ వేంకటేశ యిటునా జీవభావము
చింతించి అందులో నీ శ్రీపాదములు గంటి
(||pallavi||)
innāḽlu naṁdu niṁdu yemi gaṁṭini
anniḍā śharaṇu sŏchchi hari ninnum̐ gaṁṭini
(||innā||)
aṁganala pasam̐ jikki alayigale kaṁṭi
baṁgāruvĕṁṭam̐ dagili bhrama gaṁṭini
muṁgiḍi kṣhetramu laṁṭi muṁchi vĕṭṭi seyam̐ gaṁṭi
aṁgaviṁchi nem̐ jūsi aṁtarātma gaṁṭini
(||innā||)
suṭṭālam̐ jeri sūsi suddula vāvulu gaṁṭi
maṭṭuleni vayasudo madamu gaṁṭi
vaṭṭi kāmyamulu sesi varusa māyalu gaṁṭi
paṭṭi nārāyaṇa yani bhakti ninnum̐ gaṁṭini
(||innā||)
viṁta saduvulavalla vere madamulu gaṁṭi
paṁtabu karmamuvalla pābamu gaṁṭi
yiṁtaḍa śhrī veṁkaḍeśha yiḍunā jīvabhāvamu
siṁtiṁchi aṁdulo nī śhrībādamulu gaṁṭi