Innaallu naa yahamkaara meṟumganidaaye nannu

ఇన్నాళ్లు నా యహంకార మెఱుఁగనిదాయె నన్ను
Language

(॥పల్లవి॥)
ఇన్నాళ్లు నా యహంకార మెఱుఁగనిదాయె నన్ను
సన్నుతించేను నేరమి క్షమియించవే హరి

(॥ఇన్నా॥)
దాసుఁడ నంటేఁ గొంత దయ దలఁతువుగాక
నీ సరివాఁడ నంటే నీవు గాచేవా
వేసరక కొలిచితే వెస మన్నింతువు గాక
వాసి వంతు లెంచుకొంటే వశ మయ్యేవా

(॥ఇన్నా॥)
నుతియించితేఁ గొంత పూనుక రక్షింతువు గాక
ప్రతి ఘటించితేఁ జలపట్టవా నీవు
గతి నీవే యంటేఁ గొంత కైవస మౌదువు గాక
యితరుల వేఁడుకొంటే నియ్యకొందువా

(॥ఇన్నా॥)
మొక్కితేనుఁ గొంత నీవు మొగమోడుదువు గాక
నిక్కి గర్వాన నుండితే నీవు మెచ్చేవా
దిక్కై యలమేల్మంగపతివి శ్రీవేంకటేశ్వర
చిక్కి యిట్టె మఱుఁగ చొచ్చితేఁ గావ కుందువా

(||pallavi||)
innāḽlu nā yahaṁkāra mĕṟum̐ganidāyĕ nannu
sannudiṁchenu nerami kṣhamiyiṁchave hari

(||innā||)
dāsum̐ḍa naṁṭem̐ gŏṁta daya dalam̐tuvugāga
nī sarivām̐ḍa naṁṭe nīvu gāsevā
vesaraga kŏliside vĕsa manniṁtuvu gāga
vāsi vaṁtu lĕṁchugŏṁṭe vaśha mayyevā

(||innā||)
nudiyiṁchidem̐ gŏṁta pūnuga rakṣhiṁtuvu gāga
pradi ghaḍiṁchidem̐ jalabaṭṭavā nīvu
gadi nīve yaṁṭem̐ gŏṁta kaivasa mauduvu gāga
yidarula vem̐ḍugŏṁṭe niyyagŏṁduvā

(||innā||)
mŏkkidenum̐ gŏṁta nīvu mŏgamoḍuduvu gāga
nikki garvāna nuṁḍide nīvu mĕchchevā
dikkai yalamelmaṁgabadivi śhrīveṁkaḍeśhvara
sikki yiṭṭĕ maṟum̐ga sŏchchidem̐ gāva kuṁduvā