ఇన్నాళ్లవంటివాఁడవా యిప్పుడు నీవూ
(॥పల్లవి॥)
ఇన్నాళ్లవంటివాఁడవా యిప్పుడు నీవూ
మన్నన గలిగితేఁ జాలు మరి నిన్నేమననూ
(॥ఇన్నా॥)
యేక తాన నాపె నిన్ను నేమని సాదించెనో
యీకడ మాతో మాటాడ నింత లోఁ గేవూ
ఆకె నీవూఁ గూడి వుండినదే మాకుఁ బదివేలు
రాకువయ్య మాయింటికి రచ్చలయ్యీఁ బనులూ
(॥ఇన్నా॥)
కడల నిన్నాపె యెంత కట్టు మట్టు సేసెనో
జడిసి నేఁదడవితే సన్నసేసేవు
నిడివితో యీవలపు నిజమైతేఁ జాలుఁగాక
తడవకు మమ్ము నీవు తతి వచ్చుదాఁకాన
(॥ఇన్నా॥)
అంతలో నేఁడాపె యెంత అప్పణ నీ కిచ్చెనో
సంతసానఁ గాఁగిలించి సరిఁ గూడితి
వంతున శ్రీ వేంకటేశ వద్దనుంటేఁ జాలుఁగాక
చెంత మాలో నింటికి విచ్చేయవయ్య యిఁకను
(||pallavi||)
innāḽlavaṁṭivām̐ḍavā yippuḍu nīvū
mannana galigidem̐ jālu mari ninnemananū
(||innā||)
yega tāna nābĕ ninnu nemani sādiṁchĕno
yīgaḍa mādo māḍāḍa niṁta lom̐ gevū
āgĕ nīvūm̐ gūḍi vuṁḍinade māgum̐ badivelu
rāguvayya māyiṁṭigi rachchalayyīm̐ banulū
(||innā||)
kaḍala ninnābĕ yĕṁta kaṭṭu maṭṭu sesĕno
jaḍisi nem̐daḍavide sannasesevu
niḍivido yīvalabu nijamaidem̐ jālum̐gāga
taḍavagu mammu nīvu tadi vachchudām̐kāna
(||innā||)
aṁtalo nem̐ḍābĕ yĕṁta appaṇa nī kichchĕno
saṁtasānam̐ gām̐giliṁchi sarim̐ gūḍidi
vaṁtuna śhrī veṁkaḍeśha vaddanuṁṭem̐ jālum̐gāga
sĕṁta mālo niṁṭigi vichcheyavayya yim̐kanu