Innaallavalem gaavu yivigo nee priyamulu

ఇన్నాళ్ళవలెఁ గావు యివిగో నీ ప్రియములు
Language

(॥పల్లవి॥)
ఇన్నాళ్ళవలెఁ గావు యివిగో నీ ప్రియములు
కొన్నిగొన్ని కానుపించి గుమితాన నున్నవి

(॥॥)
చెనకి నామోముచూచి సెలవుల నవ్వేవు
ననువు నీ చేఁతలెల్ల నవ్వులేకావా
వెనకటివలె నంటా వేఁడుకొన వచ్చితేను
పెనఁగేవు మతి నేమివెట్టుక వున్నాఁడవో

(॥॥)
చిక్కని నామోవియని సిగ్గులు వడేవు నీవు
పక్కన నీపని సిగ్గువాటే కాదా
చిక్కితివంటా నీపైఁ జేతులు నేఁ జాఁచితేను
నిక్కి తప్పించుకొనేవు నీవోజ లింకేటివో

(॥॥)
పచ్చిగా నారతిఁ జొక్కి బమసి మైమఱచేవు
మచ్చిక పంతముచూచి మఱుపే కాదా
యిచ్చట శ్రీవేంకటేశ యేనసిన నామేలు
రచ్చలఁ బెట్టేవు నీరాజ మింకేఁటిదో

(||pallavi||)
innāḽḽavalĕm̐ gāvu yivigo nī priyamulu
kŏnnigŏnni kānubiṁchi gumidāna nunnavi

(||||)
sĕnagi nāmomusūsi sĕlavula navvevu
nanuvu nī sem̐talĕlla navvulegāvā
vĕnagaḍivalĕ naṁṭā vem̐ḍugŏna vachchidenu
pĕnam̐gevu madi nemivĕṭṭuga vunnām̐ḍavo

(||||)
sikkani nāmoviyani siggulu vaḍevu nīvu
pakkana nībani sigguvāḍe kādā
sikkidivaṁṭā nībaim̐ jedulu nem̐ jām̐sidenu
nikki tappiṁchugŏnevu nīvoja liṁkeḍivo

(||||)
pachchigā nāradim̐ jŏkki bamasi maimaṟasevu
machchiga paṁtamusūsi maṟube kādā
yichchaḍa śhrīveṁkaḍeśha yenasina nāmelu
rachchalam̐ bĕṭṭevu nīrāja miṁkem̐ṭido