ఇన్నాళ్లవలెఁ గావు యివే నీ మోముకళలు
(॥పల్లవి॥)
ఇన్నాళ్లవలెఁ గావు యివే నీ మోముకళలు
తన్నుఁదానే మీఁద మీఁద దైలువారీ నిపుడు
(॥ఇన్నా॥)
చెలఁగి యాతఁడు నీకుఁ జెప్పిపంపినమాటలు
వెలఁదిరో వీనులారా వింటివటవే
సొలవక నీకిచ్చినసురటిలో తనరూపు
నిలుకడైనభావము నీమతి నిల్చెనటే
(॥ఇన్నా॥)
ననిది నీదిక్కు చూచి నవ్వినయట్టినవ్వులు
పెనగి సంతోసాలై పెరిగెనటే
చెనకి నిన్నెచ్చరించి చిమ్మిరేఁచినసిగ్గులు
తనివొందించి నిన్నింకాఁ దలఁపించెనటవే
(॥ఇన్నా॥)
గుదిగొన నిన్నుఁ దాఁ గూడినకూటమి
కదిసి నిన్ను నేర్పరిఁగాఁ జేసెనటే
యిదె శ్రీవేంకటేశుఁడు యే నలమేలుమంగను
వెదకి నన్నేలె నీకు వేడుకాయనటవే
(||pallavi||)
innāḽlavalĕm̐ gāvu yive nī momugaḽalu
tannum̐dāne mīm̐da mīm̐da dailuvārī nibuḍu
(||innā||)
sĕlam̐gi yādam̐ḍu nīgum̐ jĕppibaṁpinamāḍalu
vĕlam̐diro vīnulārā viṁṭivaḍave
sŏlavaga nīgichchinasuraḍilo tanarūbu
nilugaḍainabhāvamu nīmadi nilsĕnaḍe
(||innā||)
nanidi nīdikku sūsi navvinayaṭṭinavvulu
pĕnagi saṁtosālai pĕrigĕnaḍe
sĕnagi ninnĕchchariṁchi simmirem̐sinasiggulu
tanivŏṁdiṁchi ninniṁkām̐ dalam̐piṁchĕnaḍave
(||innā||)
gudigŏna ninnum̐ dām̐ gūḍinagūḍami
kadisi ninnu nerbarim̐gām̐ jesĕnaḍe
yidĕ śhrīveṁkaḍeśhum̐ḍu ye nalamelumaṁganu
vĕdagi nannelĕ nīgu veḍugāyanaḍave