Innaallavalem gaadu yippudu neebhaavamu

ఇన్నాళ్లవలెఁ గాదు యిప్పుడు నీభావము
Language

(॥పల్లవి॥)
ఇన్నాళ్లవలెఁ గాదు యిప్పుడు నీభావము
చిన్నారిపొన్నారి నోరఁ జెప్పవయ్యా సుద్దులు

(॥ఇన్నా॥)
యింతి యెవ్వతైనా వచ్చి యీడనీకు నిచ్చెనో
వింతవుంగరము నీవేల నున్నది
చెంతనుండి యాపె నీకు సేవలేమైనాఁ జేసెనో
కాంతుఁడ నీపచ్చడానఁ గడుపస వున్నది

(॥ఇన్నా॥)
యెంచరానిచుట్టము నీకెవ్వతైనా యిచ్చెనో
మించులపుంజాలదండ మెడ నున్నది
కంచముపొత్తు గలసి కాఁపురాలు సేసెనో
మించునీచెక్కుల నంటి మెరసీఁ గాటుకలు

(॥ఇన్నా॥)
వన్నెలాఁడి యెవ్వతైనా వాడికై నీకిచ్చెనో
చెన్నగు బాహుపురి నీ చేత యున్నది
ఇన్నిటా శ్రీ వెంకటేశ యేలితివి నన్ను నేఁడు
యెన్న నా సొమ్ములే కావా యెఱిఁగితి నేను

(||pallavi||)
innāḽlavalĕm̐ gādu yippuḍu nībhāvamu
sinnāribŏnnāri noram̐ jĕppavayyā suddulu

(||innā||)
yiṁti yĕvvadainā vachchi yīḍanīgu nichchĕno
viṁtavuṁgaramu nīvela nunnadi
sĕṁtanuṁḍi yābĕ nīgu sevalemainām̐ jesĕno
kāṁtum̐ḍa nībachchaḍānam̐ gaḍubasa vunnadi

(||innā||)
yĕṁcharānisuṭṭamu nīgĕvvadainā yichchĕno
miṁchulabuṁjāladaṁḍa mĕḍa nunnadi
kaṁchamubŏttu galasi kām̐purālu sesĕno
miṁchunīsĕkkula naṁṭi mĕrasīm̐ gāḍugalu

(||innā||)
vannĕlām̐ḍi yĕvvadainā vāḍigai nīgichchĕno
sĕnnagu bāhuburi nī seda yunnadi
inniḍā śhrī vĕṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
yĕnna nā sŏmmule kāvā yĕṟim̐gidi nenu