Innaallavalem gaadu ippudu neevunna jaada

ఇన్నాళ్ళవలెఁ గాదు ఇప్పుడు నీవున్న జాడ
Language

(॥పల్లవి॥)
ఇన్నాళ్ళవలెఁ గాదు ఇప్పుడు నీవున్న జాడ
కన్నుల పండుగలుఁగాఁ గానవచ్చె మాకును

(॥ఇన్నా॥)
మొగమునఁ గళలక్కె ముచ్చటలు గడు నిక్కె
మగువ నీపతివచ్చి మన్నించె నటే
నగవు సెలవిఁ దేరె ననిచి సిగ్గులు మీరె
మిగులా నాతఁడు నీకు మేలువాఁ డాయనటే

(॥ఇన్నా॥)
కన్నుల వెన్నెలగాసె కడుఁ గుచములు రాసె
యెన్నికగాఁ జన వాతఁ డిచ్చెనటవే
చిన్నిమోవి దేనెలుబ్బె చెక్కుల గురుతు లబ్బె
వున్నతి నీయింటిలోఁ దానున్నవాఁడటే

(॥ఇన్నా॥)
నొసలెల్లాఁ జెమరించె నునుమేను పులకించె
యెసఁగి శ్రీవేంకటేశుఁ డేలెనటవే
మసలక యలమేలుమంగవు పగలురేలు
వసమైతి వీతఁ డిట్టె వరమిచ్చెనటవే

(||pallavi||)
innāḽḽavalĕm̐ gādu ippuḍu nīvunna jāḍa
kannula paṁḍugalum̐gām̐ gānavachchĕ māgunu

(||innā||)
mŏgamunam̐ gaḽalakkĕ muchchaḍalu gaḍu nikkĕ
maguva nībadivachchi manniṁchĕ naḍe
nagavu sĕlavim̐ derĕ nanisi siggulu mīrĕ
migulā nādam̐ḍu nīgu meluvām̐ ḍāyanaḍe

(||innā||)
kannula vĕnnĕlagāsĕ kaḍum̐ gusamulu rāsĕ
yĕnnigagām̐ jana vādam̐ ḍichchĕnaḍave
sinnimovi denĕlubbĕ sĕkkula gurudu labbĕ
vunnadi nīyiṁṭilom̐ dānunnavām̐ḍaḍe

(||innā||)
nŏsalĕllām̐ jĕmariṁchĕ nunumenu pulagiṁchĕ
yĕsam̐gi śhrīveṁkaḍeśhum̐ ḍelĕnaḍave
masalaga yalamelumaṁgavu pagalurelu
vasamaidi vīdam̐ ḍiṭṭĕ varamichchĕnaḍave