Innaallavalem gaadu ippudu neevu

ఇన్నాళ్ళవలెఁ గాదు ఇప్పుడు నీవు
Language

(॥పల్లవి॥)
ఇన్నాళ్ళవలెఁ గాదు ఇప్పుడు నీవు
తిన్నని మోమునఁ గళ దేరుచుకున్నాఁడవు

(॥॥)
గద్దరికన్నుల నిన్ను గద్దించి గద్దించి
సుద్దులు చెప్పుతానుండె సుదతి నీతో
పొద్దువొద్దుకేమైనా బుద్దులు నీకుఁ జెప్పునో
తిద్దువడె నీ గుణాలు తేటతెల్ల మిగను

(॥॥)
జవ్వనపుచునుఁగవ సరిఁ గులికి కులికి
నవ్వులు నవ్వుతానుండె నాతి నీ తోను
అవ్వల దొక్కకుండా నిన్నలవరచుకొనెనో
రవ్వలాయ నీవలపు రాతిఁబగలును

(॥॥)
వుట్టిపడ మోవితేనే లూరఁబెట్టి వూరఁబెట్టి
పట్టిపెనఁగుతానుండె పడఁతి నీతో
నెట్టన శ్రీ వేంకటేశ నిన్ను సిగ్గుదేర్చెనో
యిట్టె నన్నుఁ గూడితివి యిచ్చకముతోడను

(||pallavi||)
innāḽḽavalĕm̐ gādu ippuḍu nīvu
tinnani momunam̐ gaḽa derusugunnām̐ḍavu

(||||)
gaddarigannula ninnu gaddiṁchi gaddiṁchi
suddulu sĕppudānuṁḍĕ sudadi nīdo
pŏdduvŏddugemainā buddulu nīgum̐ jĕppuno
tidduvaḍĕ nī guṇālu teḍadĕlla miganu

(||||)
javvanabusunum̐gava sarim̐ guligi kuligi
navvulu navvudānuṁḍĕ nādi nī tonu
avvala dŏkkaguṁḍā ninnalavarasugŏnĕno
ravvalāya nīvalabu rādim̐bagalunu

(||||)
vuṭṭibaḍa movidene lūram̐bĕṭṭi vūram̐bĕṭṭi
paṭṭibĕnam̐gudānuṁḍĕ paḍam̐ti nīdo
nĕṭṭana śhrī veṁkaḍeśha ninnu siggudersĕno
yiṭṭĕ nannum̐ gūḍidivi yichchagamudoḍanu