Innaallavaamdave kaavaa imta vunnadaa neegu

ఇన్నాళ్ళవాఁడవె కావా ఇంత వున్నదా నీకు
Language

(॥పల్లవి॥)
ఇన్నాళ్ళవాఁడవె కావా ఇంత వున్నదా నీకు
మన్ననతో నెట్లా మర్మము లంటెనో

(॥ఇన్నా॥)
జలజలఁ జెమరించె సరసుఁడ నీమేను
కలికి యేమని యేకతమాడెనో
కళలు నీమోమున గక్కన నిండె నిట్టె
అలరి మరి యేమని ఆనఇచ్చెనో

(॥ఇన్నా॥)
ముసిముసినవ్వు రేఁగె ముంచి నీసెలవులను
కొసరి ప్రియ మెంత నీకుఁ జెప్పెనో
సుసరాన మోమునకు సొంపువచ్చె నింతలోనె
వసమై నీ కెట్లు మోమువంచి మొక్కెనో

(॥ఇన్నా॥)
వెడవెడఁ బులకలు వెలసె నీ చెక్కులను
అడియాలపుగోర నెట్టదిమెనో
కడఁగి శ్రీవేంకటేశ కాంతఁ గూడి మమ్మేలితి
తడఁబడీ సంతోసము తగనా కేమనెనో

(||pallavi||)
innāḽḽavām̐ḍavĕ kāvā iṁta vunnadā nīgu
mannanado nĕṭlā marmamu laṁṭĕno

(||innā||)
jalajalam̐ jĕmariṁchĕ sarasum̐ḍa nīmenu
kaligi yemani yegadamāḍĕno
kaḽalu nīmomuna gakkana niṁḍĕ niṭṭĕ
alari mari yemani āna̮ichchĕno

(||innā||)
musimusinavvu rem̐gĕ muṁchi nīsĕlavulanu
kŏsari priya mĕṁta nīgum̐ jĕppĕno
susarāna momunagu sŏṁpuvachchĕ niṁtalonĕ
vasamai nī kĕṭlu momuvaṁchi mŏkkĕno

(||innā||)
vĕḍavĕḍam̐ bulagalu vĕlasĕ nī sĕkkulanu
aḍiyālabugora nĕṭṭadimĕno
kaḍam̐gi śhrīveṁkaḍeśha kāṁtam̐ gūḍi mammelidi
taḍam̐baḍī saṁtosamu taganā kemanĕno