ఇంతులు పొందైన దెల్లా నీసడించే కొరకా
(॥పల్లవి॥)
ఇంతులు పొందైన దెల్లా నీసడించే కొరకా
కాంతుని చిత్తమే కాక కడుఁ గొసరకురే
(॥॥)
ఆసలఁ బొరలి పతి నట్టే రాయిడించుకంటే
వాసితోడ నుండఁగాను వచ్చినంతే మేలు
వేరించి యేమైనా వెంగెము లాడుటకంటే
మూసిన ముత్యమువంటి మోనమె మేలు
(॥॥)
ఱట్టడితనానఁ జెప్పే చుట్టరికమున కంటే
గుట్టు తోడ నుండఁగాను కూడినంతే మేలు
పట్టి పెనఁగి పిలిచి బలిమి సేయుట కంటే
చుట్టి చుట్టి యెదురులు చూచుటే మేలు
(॥॥)
జడిసి సిగ్గుపడక సారెకుఁ బై కొనుకంటే
అడఁకువ తో నుండఁగా నై నంతే మేలు
యెడయక శ్రీ వేంకటేశుఁ డిట్టే నన్నుఁగూడె
వుడివోని సంతోసాన నుండుటే మేలు
(||pallavi||)
iṁtulu pŏṁdaina dĕllā nīsaḍiṁche kŏragā
kāṁtuni sittame kāga kaḍum̐ gŏsaragure
(||||)
āsalam̐ bŏrali padi naṭṭe rāyiḍiṁchugaṁṭe
vāsidoḍa nuṁḍam̐gānu vachchinaṁte melu
veriṁchi yemainā vĕṁgĕmu lāḍuḍagaṁṭe
mūsina mutyamuvaṁṭi monamĕ melu
(||||)
ṟaṭṭaḍidanānam̐ jĕppe suṭṭarigamuna kaṁṭe
guṭṭu toḍa nuṁḍam̐gānu kūḍinaṁte melu
paṭṭi pĕnam̐gi pilisi balimi seyuḍa kaṁṭe
suṭṭi suṭṭi yĕdurulu sūsuḍe melu
(||||)
jaḍisi siggubaḍaga sārĕgum̐ bai kŏnugaṁṭe
aḍam̐kuva to nuṁḍam̐gā nai naṁte melu
yĕḍayaga śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭe nannum̐gūḍĕ
vuḍivoni saṁtosāna nuṁḍuḍe melu