ఇంతులు నోఁచిన నోఁమో ఇది నీకు విలాసమో
(॥పల్లవి॥)
ఇంతులు నోఁచిన నోఁమో ఇది నీకు విలాసమో
యెంతైనానుఁ బొగడక యెట్లు మానవచ్చును
(॥॥)
సిగ్గుతో నేనుండితేను చేరి మాటలాడింతువు
దగ్గర లోఁగితే వచ్చి తమి రేఁతువు
వెగ్గళించక కొంకితే వెఱప దెలుపుదువు
యెగ్గులేని నీ గుణాలు కెవ్వరు వలవరు
(॥॥)
వినయాన నేనుండితే వేడుకఁ జేయి చాఁతువు
నను నేనే దూరుకొంటే నవ్వింతువు
మన సెఱఁగ కుండితే మందెమేళము సేతువు
యెనలేని నీచేఁ తల కెవ్వరిఁక మెచ్చరు
(॥॥)
గుట్టున నే నుండితేను కూడి చనవిత్తువు
చుట్టరికాలెంచుకొంటేఁ జొక్కింతువు
నెట్టన శ్రీ వేంకటేశ నేఁడు నన్ను నేలితివి
యిట్టే నీసుద్దులకు నెవ్వ రిటు మొక్కరూ
(||pallavi||)
iṁtulu nom̐sina nom̐mo idi nīgu vilāsamo
yĕṁtainānum̐ bŏgaḍaga yĕṭlu mānavachchunu
(||||)
siggudo nenuṁḍidenu seri māḍalāḍiṁtuvu
daggara lom̐gide vachchi tami rem̐tuvu
vĕggaḽiṁchaga kŏṁkide vĕṟaba dĕlubuduvu
yĕgguleni nī guṇālu kĕvvaru valavaru
(||||)
vinayāna nenuṁḍide veḍugam̐ jeyi sām̐tuvu
nanu nene dūrugŏṁṭe navviṁtuvu
mana sĕṟam̐ga kuṁḍide maṁdĕmeḽamu seduvu
yĕnaleni nīsem̐ tala kĕvvarim̐ka mĕchcharu
(||||)
guṭṭuna ne nuṁḍidenu kūḍi sanavittuvu
suṭṭarigālĕṁchugŏṁṭem̐ jŏkkiṁtuvu
nĕṭṭana śhrī veṁkaḍeśha nem̐ḍu nannu nelidivi
yiṭṭe nīsuddulagu nĕvva riḍu mŏkkarū